E-Paper
Advertisement

America: విషాదం.. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం

America: విషాదం.. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
Advertisement

America: తీవ్ర విషాదం.. సంపాదన కోసం వెళ్లి అనంత లోకాలకు వెళ్లాడు.. ప్రస్తుత కాలంలో చదువు పూర్తవడమే ఆలస్యం.. అందరిని వదిలేసి డబ్బు కోసం విదేశాలకు వలస వెళుతున్నారు. అక్కడే సెటిల్ అవుతున్నారు. అలాగే రాకేశ్ కూడా వెళ్లాడు.. అయితే వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (40) అమెరికాలో గుండెపోటుతో కన్నుమూశారు. వరంగల్ నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్త జితేంద్ర కుమారుడైన రాకేశ్, ఉన్నత చదువుల అనంతరం గత పదేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు.

భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఆయన అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారని, ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచారని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. నిన్నటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న రాకేశ్, ఇలా ఆకస్మికంగా మరణించడంతో వరంగల్‌లోని ఆయన నివాసంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

అయితే రాకేశ్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో ఆయనకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో నివాసముంటోంది. విదేశాల్లో స్థిరపడి, కెరీర్‌లో రాణిస్తూ కుటుంబానికి అండగా ఉంటున్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్రంగా కలచివేస్తోంది. రాకేశ్ మరణవార్త విన్న స్థానిక ప్రవాస భారతీయులు వారి కుటుంబానికి అండగా నిలుస్తున్నారు.

ప్రస్తుతం రాకేశ్ భౌతిక కాయాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలోని తెలుగు సంఘాలు, స్థానిక అధికారుల సమన్వయంతో త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుమారుడి అకాల మరణంతో తండ్రి జితేంద్ర, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక ప్రతిభావంతుడైన యువ ఇంజినీర్‌ను కోల్పోవడం పట్ల వరంగల్ ప్రజలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Also Read: ఇరాన్ యుద్ధం.. బుక్కైన 19 మంది భారతీయులు, ఆపై అరెస్టులు, శిక్షలు కఠినంగానే

ఈ క్లిష్ట సమయంలో బాధితులకు ప్రభుత్వ సహాయం, ప్రవాస సంఘాల సహకారం ఎంతో అవసరమని ఆయన స్నేహితులు కోరుతున్నారు. రాకేశ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా వరంగల్ తరలించేందుకు కావాల్సిన వీసా, ఇతర ఫార్మాలిటీలను పూర్తి చేయడంలో అక్కడి అధికారులు నిమగ్నమయ్యారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×