E-Paper
Advertisement

Kenya Dam Collapses: కెన్యాలో ఘోర ప్రమాదం.. డ్యామ్ కూలి 42 మంది మృతి

Kenya Dam Collapses: కెన్యాలో ఘోర ప్రమాదం.. డ్యామ్ కూలి 42 మంది మృతి
Advertisement

Kenya Dam Collapses: కెన్యాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ డ్యామ్ కూలడంతో సుమారు 42 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

ఆఫ్రికా దేశమైన కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా అక్కడ ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో దేశంలోని పలు ప్రధాన డ్యామ్ లు, నదులు నిండి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని డ్యామ్ లు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Advertisement

ఈ క్రమంలో తాజాగా పశ్చిమ కెన్యాలోని రిఫ్ట్ వ్యాలీ లోని కిజాబె డ్యామ్ నీటి ఉద్ధృతి ఎక్కువ అవ్వడంతో కొట్టుకుపోయింది. దీంతో అందులోని నీరంతా ఒక్కసారిగా దిగువ గ్రామాల్లోని పోటెత్తింది. ఒక్కసారిగా డ్యామ్ లోని నీరు పొంగుకు రావడంతో సుమారు 42 మంది నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి మరణించారు. ఈ విషయాన్ని నకురు కౌంటీ గవర్నర్ సుసాన్ కిహికా తెలిపారు.

Also Read: రఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 15 మంది మృతి ?

Advertisement

నీటి ఉద్ధృతికి దిగువ ప్రాంతాల్లోని పలు ఇళ్లు, రోడ్లు కొట్టుకుపోయి.. చాలా ప్రాంతాలు బురదలో చిక్కుకున్నాయి. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారు 100 మందికిపైగా మరణించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×