E-Paper
Advertisement

తుర్కియేలో ఆగని తూటాల మోత.. పాఠశాలలో విద్యార్థి మారణహోమం.. 9 మంది మృతి, 13 మందికి గాయాలు

తుర్కియేలో ఆగని తూటాల మోత.. పాఠశాలలో విద్యార్థి మారణహోమం.. 9 మంది మృతి, 13 మందికి గాయాలు
Advertisement

School Shooting: అక్షరాయుధాలు పట్టాల్సిన చేతులు.. మారణాయుధాలు పట్టాయి. ప్రశాంతంగా సాగిపోతున్న పాఠశాల వాతావరణం ఒక్కసారిగా రక్తసిక్తమైంది. తుర్కియేలో వరుసగా రెండో రోజు చోటుచేసుకున్న ఈ కాల్పుల ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కహ్రామన్‌మరాస్ ప్రావిన్సులోని ఓ పాఠశాల వేదికగా జరిగిన ఈ దారుణంలో ఉపాధ్యాయుడితో సహా తొమ్మిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

తరగతి గదిలో మృత్యుఘోష
బుధవారం ఉదయం పాఠశాల యధావిధిగా నడుస్తోంది. అప్పటివరకు పాఠాలతో సందడిగా ఉన్న రెండు తరగతి గదుల్లోకి అకస్మాత్తుగా ఒక విద్యార్థి ప్రవేశించాడు. తన వెంట తెచ్చుకున్న తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించాడు. ఊహించని ఈ దాడితో విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘోర కలికాల్లో ఒక టీచర్, ఎనిమిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మరణించగా, మరో 13 మంది రక్తపు మడుగులో విలవిలలాడారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తుర్కియే అంతర్గత వ్యవహారాల మంత్రి ముస్తఫా వెల్లడించారు.

Advertisement

వ్యూహాత్మకంగా వచ్చిన ‘బాల కిరాతకుడు’
ఈ ఘాతుకానికి పాల్పడిన విద్యార్థి నేపథ్యం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. నిందితుడి తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారి అని సమాచారం. బాలుడు పక్కా ప్రణాళికతోనే పాఠశాలకు వచ్చినట్లు తెలుస్తోంది. తన వెంట ఏకంగా ఐదు తుపాకులు, ఏడు నిండుగా ఉన్న మ్యాగజైన్లను బ్యాగులో దాచుకుని తీసుకువచ్చాడు. ఒక సాధారణ విద్యార్థి ఇంత పెద్ద మొత్తంలో ఆయుధాలను పాఠశాల లోపలికి ఎలా తీసుకురాగలిగాడు అనేది ఇప్పుడు భద్రతా వైఫల్యాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

నిందితుడి మృతి.. మిస్టరీగా మారిన కారణం
కాల్పుల అనంతరం జరిగిన గందరగోళంలో సదరు విద్యార్థి కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో మరణించాడా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అసలు ఆ విద్యార్థిలో ఇంతటి కసి పెరగడానికి కారణమేంటి? తోటి విద్యార్థులపైనే ఎందుకు పగ పెంచుకున్నాడు? వంటి విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి ఇది ముందస్తు కుట్రగా అధికారులు భావిస్తున్నారు.

Advertisement

వరుస దాడులతో వణికిపోతున్న తుర్కియే
తుర్కియేలో విద్యాసంస్థలపై దాడులు జరగడం గత రెండు రోజుల్లో ఇది రెండోసారి. అంతకుముందు మంగళవారం శాన్లియుర్ఫా ప్రావిన్సులోని ఒక హైస్కూల్‌లో కూడా ఓ విద్యార్థి జరిపిన కాల్పుల్లో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన మరువకముందే బుధవారం మరో ఘోరం జరగడం ఆ దేశ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. వరుసగా జరుగుతున్న ఈ కాల్పుల వెనుక విద్యార్థుల మానసిక ఒత్తిడి ఉందా లేక ఇతర ప్రేరేపిత అంశాలు ఉన్నాయా అనే కోణంలో ప్రభుత్వం విచారణను వేగవంతం చేసింది.

Also Read: హర్మూజ్ జలసంధికి ట్రంప్ పర్మనెంట్ అన్-లాక్.. పాస్‌వర్డ్ చైనాకు షేర్ చేసిన డొనాల్డ్!

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×