E-Paper
Advertisement

Putin: దక్షిణ కొరియాకు పుతిన్ వార్నింగ్ !

Putin: దక్షిణ కొరియాకు పుతిన్ వార్నింగ్ !
Advertisement

Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ దక్షిణ కొరియాకు వార్నింగ్ ఇచ్చాడు. రష్యాతో జరుగుతున్న యుద్దంలో ఒకవేళ ఉక్రేయిన్‌కు దక్షిణ కొరియా మద్దతు ఇస్తే.. అది అతి పెద్ద తప్పు అవుతుందని అన్నారు.ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో జరిగిన పరస్పర ఒప్పందంపై సంతకం చేసిన పుతిన్ ఆ తర్వాత వియత్నాంలో ప్రసంగించారు. రష్యా, ఉత్తర కొరియా మధ్య స్నేహం కుదరడంతో దక్షిణ కొరియా అంశం గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయాలని దక్షిణ కొరియా నిర్ణయిస్తే, అప్పుడు తాము తీసుకునే నిర్ణయాలు దక్షిణ కొరియాకు ఇబ్బందిని కలిగిస్తాయని పుతిన్ తెలిపారు.

అమెరికాతో పాటు అమెరికా మిత్ర దేశాలు ఒక వేళ ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరా కొనసాగిస్తే అప్పుడు ఉత్తర కొరియాకు తాము ఆయుధాలు సరఫరా చేస్తామని చెప్పారు. రష్యాపై యుద్దంలో ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తే అది దక్షిణ కొరియా తప్పుచేసినట్లు అవుతుందని పుతిన్ హెచ్చరించారు. దక్షిణ కొరియా ఉక్రెయిన్‌కు మానవ సహాయం, సైనిక సామాగ్రిని అందించినప్పటికీ యుద్దంలో దేశాలకు ఆయుధాలను ఇవ్వకూడదనే అధికార విధానాన్ని కలిగి ఉండటం వల్ల ఇప్పటివరకు మారణాయుధాలను అందించడానికి నిరాకరించింది.

Advertisement

Also Read: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బిల్‌గేట్స్ మాజీ భార్య

శుక్రవారం యూఎస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ రష్యా- ఉత్తర కొరియా ఒప్పందాన్ని తులనాడారు. చాలా రోజులుగా ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్న రక్షణ సంబంధాల గురించి అమెరికా హెచ్చరిస్తూనే ఉందని తెలిపారు. ఉత్తర కొరియాతో సైనిక సహాకారాన్ని అధ్యక్షుడు పుతిన్ తోసిపుచ్చుకోవడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. ఉత్తర కొరియా- రష్యా ఒప్పందంపై జపాన్ కూడా స్పందించింది. వీరి ఒప్పందం ఆందోళన కలిగిస్తుందని ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి యోషిమాసా హయాషి అన్నారు.

Advertisement

 

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×