// // Bomb Shelter Dating App: బాంబు షెల్టర్లలో ఉండేవారి కోసం.. ఇజ్రాయెల్ డేటింగ్ యాప్.. ఈ టైమ్‌లో రొమాన్స్ ఏంటో! - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Bomb Shelter Dating App: బాంబు షెల్టర్లలో ఉండేవారి కోసం.. ఇజ్రాయెల్ డేటింగ్ యాప్.. ఈ టైమ్‌లో రొమాన్స్ ఏంటో!

Bomb Shelter Dating App: బాంబు షెల్టర్లలో ఉండేవారి కోసం.. ఇజ్రాయెల్ డేటింగ్ యాప్.. ఈ టైమ్‌లో రొమాన్స్ ఏంటో!
Advertisement

Bomb Shelter Dating App: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం ప్రజల జీవితాలను మార్చేస్తున్నాయి. క్షిపణి దాడుల హెచ్చరికలతో బాంబు షెల్టర్లలోకి పరుగులు ఇజ్రాయెల్ ప్రజల డైలీ వర్క్ లో భాగంగా మారాయి. ఈ ఉద్రిక్త వాతావరణంలో.. ఒక అసాధారణ ఆలోచన ఇటీవల ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుంది. “బాంబ్ షెల్టర్ డేటింగ్ యాప్” అనే ఐడియాను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో హైలైట్ చేసింది. వైమానిక దాడుల సైరన్‌ల సమయంలో బాంబ్ షెల్టర్లలో ఉంటున్న సింగిల్స్ QR-కోడ్ ఉపయోగించి అదే షెల్టర్‌లోని ఇతరులతో కనెక్ట్ కావచ్చని సూచించింది.

సింగిల్స్ కనెక్ట్ అయ్యేందుకు

ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో విమర్శలకు దారితీసింది. కొందరు దీనిని కష్ట సమయంలో ఓ సృజనాత్మక ఆలోచనగా భావించారు. మరికొందరు ఇదేం పనంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ ఆలోచనను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ లో పోస్ట్ చేసింది. క్షిపణి దాడుల సమయంలో ప్రజలు భయాందోళన చెందకుండా సృజనాత్మకంగా డేటింగ్ యాప్ ఆలోచన చేశామని విదేశాంగ తెలిపింది. బాంబ్ షెల్టర్లలో ఉన్న సింగిల్స్ కోసం డేటింగ్ ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చి పేర్కొంది.

Advertisement

షెల్టర్లలో వేచి ఉన్నప్పుడు ప్రజలు కనెక్ట్ అవ్వడానికి ఈ యాప్ సహాయపడుతుందని, ఉద్రిక్త సమయంలో సోషల్ కనెక్టివిటీగా ఇది సహాయపడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎవరు ఒంటరిగా ఉన్నారో ఈ యాప్ చూపిస్తుందని ఎక్స్ పోస్టు చేసింది.

సింగిల్స్ కోసం డేటింగ్ యాప్

సింగిల్స్ కనెక్ట్ అయ్యేందుకు రూపొందించిన స్పీడ్-డేటింగ్ ప్లాట్‌ఫామ్ హూక్ట్ అని నిర్వాహకులు తెలిపారు. బాంబ్ షెల్టర్ ఎంట్రెన్ లో QR కోడ్‌ను ఉంచుతారు. దీని వలన షెల్టర్ లో సింగిల్స్ ఎవరు ఉన్నారో చూడటానికి వీలుంటుంది. ఈ విధానం బాంబు షెల్టర్లకు అనుగుణంగా ఉంటుంది. సింగిల్స్ ఒకరినొకరు గుర్తించేందుకు ఇది సహాయపడుతుంది.
QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత.. ఇద్దరు వినియోగదారులు ఆసక్తి చూపిస్తే.. ఆన్ లైన్ లో చాట్ చేయడం లేదా నేరుగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేయవచ్చు.

Advertisement

ఈ ఆలోచన ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబారి మైక్ హకబీ దృష్టిని కూడా ఆకర్షించింది. ఆయన ఈ పోస్ట్‌ను Xలో షేర్ చేసి, ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ఎలా గుర్తుంచుకోవాలని ఒక జోక్ యాడ్ చేశారు. “ఏదో ఒక రోజు వారు తమ పిల్లలకు ‘మేము ఒక షెల్టర్ లో డేటింగ్ యాప్‌లో బ్యాలస్టిక్ క్షిపణులను తప్పించుకుంటూ కలుసుకున్నాము’ అని తల్లిదండ్రులు చెబుతారని ఆయన పోస్ట్ చేశారు.

మరికొందరు బయట పరిస్థితి తీవ్రతంగా ఉంటే ఇలాంటి ఆలోచన సరికాదని విమర్శలు చేశారు. ప్రజలు చనిపోతున్నారు, వారు బాధల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ చెత్త ఆలోచనలు ఏంటి అని పోస్టు పెట్టారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×