E-Paper
Advertisement

‘Wagner’ Attacks on Russian Army :పుతిన్‌పై తిరుగుబాటు.. రష్యా సైన్యంపై ‘వాగ్నర్’ దాడులు..

‘Wagner’ Attacks on Russian Army :పుతిన్‌పై తిరుగుబాటు.. రష్యా సైన్యంపై ‘వాగ్నర్’ దాడులు..
Advertisement
army

‘Wagner’ Attacks on Russian Army : రష్యా యుద్దం కీలక మలుపు తీసుకుంది. మాస్కోలోనే తిరుగుబాటు మొదలైంది. రష్యా సైన్యంపై మెర్సినరీ గ్రూప్ వాగ్నర్ దాడులు చేస్తోంది. పుతిన్ ప్రభుత్వం పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేసి తమ 2 వేల మంది సిబ్బందిని హతమార్చిందని వాగ్నర్ చీఫ్ యెవ్‌గనీ ప్రకటించారు. ఏదిఏమైనా రష్యా మిలటరీ నాయకత్వాన్ని కుప్పకూలుస్తామని సవాల్ చేశారు. ప్రస్తుతం తమ దగ్గర 25వేల మంది సిబ్బంది ఉన్నారని, త్వరలోనే మరో పాతికవేల మందిని సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు. రష్యా ప్రజల కోసం పోరాడుతున్న తమపైనే ప్రభుత్వం దాడులు చేయటం అత్యంత కిరాతకమని అన్నారు.

Advertisement

అటు రష్యా ప్రభుత్వం కూడా దీన్ని దృవీకరింది. దేశంలో సాయుద తిరుగుబాటు జరుగుతోందని ప్రకటించింది. వాగ్నర్ తిరుగుబాటు రష్యాకు, దేశ అధ్యక్షుడు పుతిన్‌కు తీవ్ర వెన్నుపోటు లాంటిదని రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ జనరల్ అలెక్సెయేవ్ అన్నారు. వాగ్నర్ చీఫ్ తమ తిరుగుబాటును వెంటనే విరమించుకోవాలని సూచిస్తూ అలెక్సెయేవ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే దేశంలోని పరిస్థితులు పుతిన్‌కు తెలుసునని, ఇప్పటికే అవసరమైన చర్యలు కూడా తీసుకున్నారని రష్యా నేత పెస్కోవ్ చెప్పారు.

రష్యలోని పరిస్థితితులపై అమెరికా స్పందించింది. మాస్కోలో పరిస్థితిని సునిశితంగా పరిశీలిస్తున్నామని వైట్ హౌస్ తెలపింది. అక్కడి పరిణామాల గురించి అక్కడ ఉన్న సన్నిహితులు, భాగస్వాములను అడిగి తెలుసుకుంటున్నామని ప్రకటించింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×