E-Paper
Advertisement

Sell Sunlight: వార్ని, ఈ సంస్థ ఏకంగా సూర్యుడి కాంతినే అమ్మేస్తుందట.. రాత్రి వేళ ‘సన్ లైట్’ ఎలా సాధ్యం?

Sell Sunlight: వార్ని, ఈ సంస్థ ఏకంగా సూర్యుడి కాంతినే అమ్మేస్తుందట.. రాత్రి వేళ ‘సన్ లైట్’ ఎలా సాధ్యం?
Advertisement

selling sunlight: ఒకప్పుడు వస్తువులు, పండ్లు ఏమైనా కావాలంటే షాపునకు వెళ్లి కొనేవారు. ఆ తరువాత షాపింగ్ మాల్స్ వచ్చాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఇప్పుడు ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏది కావాలన్నా ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. మొదటగా రోజులు పట్టేది ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువులు ఇంటి వద్దకు రావాలంటే. కానీ, ఇప్పుడు చాలా ఫాస్ట్ గా గంటలు.. వీలైతే నిమిషాల వ్యవధిలోనే తమ వద్దకు వచ్చి చేరుతున్నాయి. ఆహారం వస్తువులు, వంటకాలు, ఇతర వస్తువులు, బట్టలు.. ఇలా ఏవైనా సరే ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టిన వెంటనే నిమిషాల వ్యవధిలో తమ వద్దకు వస్తున్నాయి. ఇదే కొంతవరకు ఆశ్చర్యమంటే.. ఇప్పుడు మీరు వినబోయే మరో విషయం గురించి తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. అదేమంటే.. సూర్య రశ్మిని అమ్ముతున్నారు. అది కూడా ఆన్ లైన్ లో ఆర్డర్ పెడితే మీకు సూర్యరశ్మిని విక్రయిస్తారు. ఉదయం సమయంలో కాదు… అన్ని సమయాల్లో సూర్యరశ్మిని అమ్ముతారు. ఇది అవాస్తవం అనుకుంటున్నారా..? అయితే, మీరు పొరపడినట్టే. ఇది అక్షరాల నిజం. దీనిపై ప్రపంచ వ్యక్తం ప్రస్తుతం చర్చ నడుస్తున్నది. తాము సూర్యరశ్మి అమ్ముతామంటూ ఓ సంస్థ చెబుతున్నది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: ఇజ్రాయెల్, హిజ్బుల్లా వార్‌కు.. ఈజిప్ట్ చర్చలకు లింక్ ఏంటి?

Advertisement

రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనేది కాలిఫోర్నియా ఆధారిత స్టార్టప్. దీని సహా వ్యవస్థాపకుడు మరియు సీఈఓగా బెన్ నోవాక్ ఉన్నారు. సూర్య రశ్మిని అవసరమైనవారికి విక్రయించే సాంకేతికతను అభివృద్ధి చేయడం ఈ సంస్థ లక్ష్యం. యాప్ ద్వారా సూర్యరశ్మీని నేరుగా కొనుగోలు చేసిన వారి స్థానానికి అందిచడం రిఫ్లెక్ట్ ఆరర్బిటల్ లక్ష్యం. సూటిగా చెప్పాలంటే ఇది డిమాండ్ పైన సూర్యరశ్మిని అందించాలని కోరుకుంటుంది. ఏ విధంగానైతే ఫుడ్ ను ఆర్డర్ పెట్టుకుంటే వారు ఇంటికి తెచ్చిస్తారు. అదేవిధంగా సూర్యరశ్మిని కూడా ఆర్డర్ పెట్టుకుంటే వీరు కూడా నేరుగా వారి ఇంటికి పంపిణీని చేస్తారు.

లండన్ లో ఏప్రిల్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎనర్జీ ఫ్రమ్ స్పేస్ కాన్ఫరెన్స్ లో బెన్ నోవాక్ ఈ విప్లవాత్మక ఆలోచనను పరిచయం చేశాడు. ‘ దీనిని వీలైనంత సులభతరం చేయాలనుకుంటున్నాం. ఇలా వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వండి. మీ జీపీఎస్ కో-ఆర్డినేట్ లను మాకు చెప్పండి మరియు మేము మీకు కొంత సూర్యరశ్మిని అందిస్తాం’ అని పేర్కొన్నాడు. అయితే, ఇందుకు సంబంధించిన వెబ్ సైట్ ను 2025లో లాంచ్ చేయనున్నట్లు ఆయన చెప్పాడు.

Advertisement

Also Read: బ్రేకింగ్ న్యూస్… చెరువులో మహిళా జర్నలిస్ట్ మృతదేహం

ఇదిలా ఉంటే ఇది విప్లవాత్మక ప్రయోగం అయినప్పటికీ ఇది సమస్యలు తెచ్చే అవకాశం లేకపోలేదు అని నిపుణులు చెబుతున్నారు. ఇది కాంతి కాలుష్యాన్ని పెంచుతుందని లేదా దాదాపు వెంటనే భూమికి తిరిగి రావొచ్చని వారు చెబుతున్నారు. కక్ష్యలో ఉన్న రిఫ్లెక్టర్లను జాగ్రత్తగా రూపొందించకపోతే ప్రకాశవంతమైన నక్షత్రాల కంటే మరింత ప్రకాశవంతంగా ప్రకాశిస్తాయని, దీంతో కాంతి కాలుష్య సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×