E-Paper
Advertisement

ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 18 మంది మిస్సింగ్, 54 మందికి గాయాలు, ఎలా జరిగింది?

ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 18 మంది మిస్సింగ్, 54 మందికి గాయాలు, ఎలా జరిగింది?
Advertisement

Qatar Gas plant: ఇరాన్ యుద్ధం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఖతార్‌కు మరో ప్రమాదం వచ్చి పడింది. గ్యాస్ ప్లాంట్‌లో అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది జాడ కనిపించలేదు. మరో 54 మంది తీవ్రంగా గాయపడినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.భారీ పేలుడుతో రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ దద్దరిల్లింది.

ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు

Advertisement

ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చడంలో ఖతార్‌ చాలా ముఖ్యమైన దేశం. ఆదివారం రాత్రి ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బర్జాన్ గ్యాస్ ప్లాంట్‌లో ఎగుమతులను ప్రారంభించడానికి సిబ్బంది ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.. ఆ ప్లాంట్ వివిధ భాగాలకు వ్యాపించాయి.

ఈ ఘటనలో 18 మంది సిబ్బంది జాడ కనిపించలేదు. మరో 54 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఖతార్ అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి మంటలు కిలోమీటర్ల దూరం వరకు కనిపించాయి. ఆకాశంలోకి దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. ఈ ఘటనతో రాజధాని దోహాతోపాటు చుట్టుపక్కల నగరాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

Advertisement

18 మంది మిస్సింగ్, 54 మందికి గాయాలు

ఘటన జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు-సివిల్ డిఫెన్స్ దళాలు రంగంలోకి దిగాయి. నాలుగైదు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి.ఖతార్ అంతర్జాతీయ సెర్చ్ అండ్ రెస్క్యూ గ్రూప్ గల్లంతైన 18 మంది కార్మికుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. ప్లాంట్ లోపల జరిగిన పేలుడు కారణంగా ప్రజారోగ్యం, పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేదని అధికారులు తెలిపారు.

బర్జాన్ గ్యాస్ ప్లాంట్ రోజుకు 1.4 బిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ ఫీట్ల వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంట్ ద్వారా వచ్చే గ్యాస్‌ను స్థానిక విద్యుత్ అవసరాలు, సముద్రపు నీటిని మంచి నీరుగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్లకు ఇంధనంగా ఉపయోగిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే గ్లోబల్ ఎల్‌ఎన్‌జీ ఎగుమతులకు గుండెకాయ లాంటిది ఆ ప్రాంతం.

ALSO READ: ట్రంప్‌కు ఇటలీ ప్రధాని మెలోనీ స్ట్రాంగ్ కౌంటర్.. మీ సంగతి చూసుకోవాలని సూచన, అసలేం జరిగింది?

ఇరాన్ జరిపిన మిసైల్ దాడుల వల్ల ఈ ప్లాంట్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యింది. నెలల తరబడి మూతపడింది. ఆ నష్టాన్ని పూడ్చుకుని, ఉత్పత్తిని మళ్లీ మొదలుపెట్టేందుకు ఇంజనీర్లు ప్లాంట్‌ను పునఃప్రారంభిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దేశీయ మార్కెట్‌కు గ్యాస్ సరఫరా చేసే ఆ ప్లాంట్‌‌లో పేలుడు వల్ల ఏమైనా నష్టం జరిగిందా? అనే విషయాన్ని ఖతార్ ఎనర్జీ సంస్థ వెల్లడించలేదు.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×