E-Paper
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్‌లో హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవ దహనం

Bangladesh: బంగ్లాదేశ్‌లో హోటల్‌కు నిప్పు.. 24 మంది సజీవ దహనం
Advertisement

Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్లర్లు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాల ఆందోళనలతో దేశం అట్టుడికిపోతోంది. తాజాగా జషోర్ జిల్లాలోని అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కు చెందిన జబీర్ ఇంటర్‌నేషనల్ హోటల్‌కు ఆందోళన కారులునిప్పంటించారు. ఈ ఘటనలో 24 మంది సజీవ దహనం అయ్యారు. అందులో ఒకరు ఇండోనేషియా పౌరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో బంగ్లాదేశ్‌లో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. 21 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనల కారణంగా వందలాది మంది మృతి చెందారు. ఇప్పటి వరకు మరణాల సంఖ్య 440 కి చేరింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే హోటల్‌కు నిప్పు పెట్టిన ఆందోళన కారులు అగ్నిమాపక సిబ్బంది రాకుండా కూడా అడ్డుకున్నారు.

Advertisement

Also Read: బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు.. కొత్త ప్రభుత్వానికి మద్దతివ్వని విద్యార్థి ఉద్యమం

హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నా కూడా దేశంలో పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హసీనాకు వ్యతిరేకంగా నిరసనల కారణంగా కొన్ని రోజులుగా మూసివేసిన పాఠశాలలను తిరిగి తెరిచినట్లు సమాచారం. దుకాణాలు, కార్యాలయాలు కూడా తెరుచుకున్నాయి. దీంతో పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×