E-Paper
Advertisement

Earthquake: టర్కీలో రెండుగా చీలిపోయిన రన్‌వే..

Earthquake: టర్కీలో రెండుగా చీలిపోయిన రన్‌వే..
Advertisement

Earthquake: టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాయం కోసం శిథిలాల కింద వేచిచూస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కలచివేస్తోంది.

ఇక భూ ప్రకంపనల ధాటికి టర్కీలోని హతయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. పగుళ్లు ఏర్పడి రన్‌వే రెండు ముక్కలుగా చీలిపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం రెండుగా చీలిపోయిన రన్‌వేకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Advertisement

ఇప్పటి వరకు రెండు దేశాల్లో కలిసి దాదాపు 5,600 భవనాలు నేలమట్టమయ్యాయి. 4,500 మందికిపైగా మృత్యువాత పడ్డారు. దాదాపు 20 వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో 20 వేల మందికి పైగా మృత్యువాత పడి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది.

భారత్ సహా అనేక దేశాలు ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన టర్కీ, సిరియాలకు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. ఇవాళ భారత్ సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, సహాయక సామాగ్రితో కూడిన ఓ విమానాన్ని టర్కీకి పంపించింది.


Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×