E-Paper
Advertisement

Earth Quakes Hit Cuba: క్యూబాను వణికించిన భూకంపం.. భారీ నష్టం

Earth Quakes Hit Cuba: క్యూబాను వణికించిన భూకంపం.. భారీ నష్టం
Advertisement

Earth Quakes Hit Cuba: క్యూబాను భారీ భూకంపం వణికించింది. దీని ధాటికి మంజినిల్లో, శాంటియాగో ప్రాంతాలు వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.8గా నమోదు అయ్యింది. బార్టోలోమోకు 40 కిలోమీటర్ల దూరంలో 13 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు.

కరేబియన్ ద్వీప దేశం క్యూబా ఆదివారం వణికింది. క్యూబా సౌత్ ప్రాంతంలో రెండు శక్తివంతమైన భూకంపాలు వణికించాయి. గన్మా ప్రావిన్స్‌లోని బార్టోలోమ్ మాసో తీరానికి 25 మైళ్ల దూరంలో ప్రకంపనలు నమోదు అయినట్టు గుర్తించారు.

Advertisement

తొలి భూకంపం వచ్చిన గంట తర్వాత మరొకటి సంభవించింది. అక్కడి ప్రభుత్వ వర్గాల ప్రకారం ఇప్పటివరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదని, దీని గురించి మరింత సమాచారం తెలియాల్సి వుందన్నారు. భూప్రకంపనలు బలంగా రావడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. భారీ ఎత్తైన భవనాలు ధ్వంసమయ్యాయి.

చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదన్నది యూఎస్ సునామీ హెచ్చరిక సంస్థ మాట. మళ్లీ భూకంపం వస్తుందనే భయంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

Advertisement

ALSO READ:  దీపావళి వేడుకల్లో మందు. మాంసం.. ఏకంగా ప్రధానికే తప్పని తిప్పలు

ఇటీవల వచ్చిన రాఫెల్ హరికేన్ నుండి కోలుకుంటున్న సమయంలో ప్రకంపనలు ఆ ద్వీపాన్ని వణికించాయి, నివాసితులకు రెండు రోజుల పాటు విద్యుత్ లేదు. దీనికితోడు భూకంపం రావడంతో ఎప్పుడు ఎలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. గతేడాది అక్టోబర్‌లో క్యూబాను వణికించింది భూకంపం. రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదు అయ్యింది.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×