E-Paper
Advertisement

నియంత్రణ తప్పిన రావలకోట్ నిరసన.. 150 మంది మృతి?

నియంత్రణ తప్పిన రావలకోట్ నిరసన.. 150 మంది మృతి?
Advertisement

Rawalakot Protests: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని రావలకోట్ ఇప్పుడు అట్టుడుకుతోంది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో స్థానికులు చేపట్టిన నిరసనలు కాస్తా హింసాత్మకంగా మారాయి. పెరిగిన విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలో నిరసనకారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.

పరిస్థితిని అదుపు చేయడానికి బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బందితో పాటు ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఇంటర్నెట్, మొబైల్ సేవలను పూర్తిగా నిలిపివేయడంతో ఖచ్చితమైన సమాచారం బయటకు రావడం లేదు.

Advertisement

ఇదే తరుణంలో సోషల్ మీడియాలో ఒక కలవరపెట్టే వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ ఘర్షణల్లో ఏకంగా 150 మందికి పైగా మరణించారంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఐతే, కమ్యూనికేషన్ బ్లాక్‌అవుట్ వల్ల ఈ నెంబర్‌ను అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. ప్రభుత్వం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెప్తున్నా, స్థానికుల్లో భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక చిన్న నిరసన ఇంతటి అల్లర్లకు దారితీయడం అక్కడ నెలకొన్న తీవ్ర అసంతృప్తికి అద్దం పడుతోంది.

Also Read: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘటనలో కొత్త విషయాలు..కార్మికులపై 1500 డిగ్రీల వేడి మెటల్, కేంద్రమంత్రి ఎక్స్ గ్రేషియా

Advertisement

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×