E-Paper
Advertisement

PoK Map Issue: పీవోకే మాదే.. యూఎస్ ముందు పాక్ పేచీ, ఆ మ్యాప్ చూసి గగ్గోలు

PoK Map Issue: పీవోకే మాదే.. యూఎస్ ముందు పాక్ పేచీ, ఆ మ్యాప్ చూసి గగ్గోలు
Advertisement

PoK Map Issue: భారత్-అమెరికా ట్రేడ్ డీల్ కుదిరిన సందర్భంగా… అమెరికా వాణిజ్య ప్రతినిధి భారత్ మ్యాప్ ను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ మ్యాప్ లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK), చైనా ఆధీనంలోని అక్సాయ్ చిన్‌తో సహా మొత్తం కశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశంలో ఉన్నట్లు చూపించారు. పీంకేను ఇండియా మ్యాప్ లో చూపించడంపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అభ్యంతరాన్ని అమెరికా అధికారులు దృష్టికి తీసుకెళ్లి ఆ పోస్టును తొలగించేలా చేశామని పాకిస్తాన్ అధికారులు తెలిపారు.

పాక్ గగ్గోలు

పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఇస్లామాబాద్ అధికారికంగా మ్యాప్ విషయాన్ని అమెరికా ప్రభుత్వానికి తీసుకెళ్లామని పేర్కొంది. ఆ మ్యాప్ చట్టవిరుద్ధమని తెలిపింది. జమ్ము, కశ్మీర్ మొత్తం భూభాగాన్ని.. భారత్ లో ఉన్నట్లు చూపించడం సరికాదని పాకిస్తాన్ భావిస్తుందని పేర్కొంది. మ్యాప్ ఉన్న పోస్ట్‌ను తొలగించడం అమెరికా వైపు దిద్దుబాటు చర్యగా భావిస్తున్నామని పాక్ తెలిపింది. ఈ వివాదంపై అమెరికా అధికారులు బహిరంగంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

అమెరికా వైఖరి మారిందా?

Advertisement

ఈ వివాదాస్పద ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించే అమెరికా ప్రభుత్వ వైఖరికి ఇది భిన్నంగా ఉంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కశ్మీర్‌పై అమెరికా విధానంలో మార్పు వచ్చిందా? లేదా పొరపాటున జరిగిందా? అనే దానిపై ఊహాగానాలు చెలరేగాయి. అధికారులు ఎలాంటి ప్రకటన చేయకుండా యూఎస్టీఆర్ సైలెంట్‌గా ఆ పోస్ట్‌ను తొలగించింది. పీవోకే, అక్సాయ్ చిన్‌ సహా పూర్తి జమ్ము కశ్మీర్, లడఖ్ తమ అంతర్భాగమని భారత్ స్పష్టం చేస్తుంది. ఈ పోస్ట్ తొలగింపుపై యూఎస్టీఆర్ కార్యాలయం ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×