E-Paper
Advertisement

Yoga: అమెరికాలో మోదీ యోగా.. గిన్నిస్‌ రికార్డ్స్‌లో ఎంట్రీ..

Yoga: అమెరికాలో మోదీ యోగా.. గిన్నిస్‌ రికార్డ్స్‌లో ఎంట్రీ..
Advertisement
pm modi yoga

Yoga: మోదీ ఏం చేసినా గ్రాండ్‌గానే చేస్తారు. అది అమెరికాలో అయితే మరింత గ్రాండ్. ఈసారి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకే ఎక్కేలా చేశారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రధాని మోదీ న్యూయార్క్‌, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం దగ్గర యోగా నిర్వహించారు. అత్యధిక దేశాలకు చెందిన ప్రతినిధులు భాగస్వామ్యం కావడంతో.. ఈ యోగా షో గిన్నిస్ రికార్డ్స్‌లో చేరింది.

యూఎన్‌వో అధికారులు, వివిధ దేశాల దౌత్యవేత్తలతో పాటు.. మొత్తంగా 180 దేశాలకు చెందిన ప్రముఖులు, ఎన్నారైలు ఒకేచోట యోగా చేశారు. న్యూయార్క్‌ మేయర్‌, గ్రామీ అవార్డ్ విన్నర్ రికీ కెజ్‌, యాక్టర్ రిచర్డ్‌ గేర్‌, ప్రియాంక చోప్రా, సింగర్ ఫాల్గుణి షా.. తదితరులతో కలిసి ప్రధాని యోగా చేశారు.

Advertisement

యోగా ఏ ఒక్క దేశానికో, మతానికో, వర్గానికో చెందినది కాదన్నారు ప్రధాని మోదీ. యోగాకు ఎలాంటి కాపీరైట్‌, పేటెంట్‌, రాయల్టీలు కూడా లేవన్నారు. యోగా భారత్‌ నుంచి వచ్చిందని.. అత్యంత ప్రాచీన చరిత్ర ఉందని.. అన్ని దేశాల సంప్రదాయాలకు సరిపోతుందని చెప్పారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందని.. ఇది పూర్తిగా విశ్వజనీనం.. ఆరోగ్యకరం.. అన్నారు ప్రధాని మోదీ.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×