E-Paper
Advertisement

PM Modi In Israel: మీ బాధ మాకు తెలుసు.. ఉగ్రపోరులో అండగా ఉంటాం- ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రధాని మోదీ

PM Modi In Israel: మీ బాధ మాకు తెలుసు.. ఉగ్రపోరులో అండగా ఉంటాం- ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రధాని మోదీ
Advertisement

PM Modi In Israel: ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి విడనాడాలని ప్రధాని మోదీ అన్నారు. ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆ దేశ పార్లమెంట్ లో ప్రసంగించారు. భారత్ ఉగ్రవాదంతో అనేక ఏళ్ల నుంచి పోరాటం చేస్తుందన్నారు. భారత్ ఉగ్రవాదానికి పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. టెర్రరిజంపై పోరులో ఇజ్రాయెల్ కు పూర్తిగా అండగా ఉంటామన్నారు. ఇజ్రాయెల్ కు రెండోసారి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. భారత్ ఏ రూపంలోనైనా ఉగ్రవాదాన్ని సమర్థించదని చెప్పారు. హమాస్‌ దాడి చేసి పౌరులను చంపడం దారుణమన్నారు.

కీలక ఒప్పందాలు

“భారత్ చర్చలు, శాంతిని కోరుతుంటుంది. శాంతిస్థాపన అనేది అంత సులువైన విషయం కాదు. ఇజ్రాయెల్‌కు భారత్ అనేక అంశాల్లో అండగా నిలుస్తుంది. పాలస్తీనా సమస్యలపై స్పందించాల్సిన సమయం వచ్చింది. ఇజ్రాయెల్‌ అందించిన టెక్నాలజీని మరచిపోలేం. రక్షణ, భద్రత విషయంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ఇజ్రాయెల్‌ సాయంతో భారత్‌ వ్యవసాయ రంగంలో సరికొత్త విజయాలు సాధించింది” అని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని మోదీకి పురస్కారం

Advertisement

భారత్, ఇజ్రాయెల్ భాగస్వామ్యాన్ని బలోపేతానికి విశేషంగా కృషి చేస్తున్న ప్రధాని మోదీని ‘స్పీకర్‌ ఆఫ్‌ ది నెసెట్‌ మెడల్’తో ఇజ్రాయెల్‌ సత్కరించింది. ఆ దేశ పార్లమెంట్ లో ప్రసంగం అనంతరం నెసెట్‌ స్పీకర్‌ అమిర్‌ ఒహానా ప్రధాని మోదీని మెడల్‌తో సత్కరించారు. దీంతో ఈ పురస్కారం అందుకున్న తొలి భారత ప్రధానిగా మోదీ ఘనత సాధించారు. ఇజ్రాయెల్‌, పాలస్తీనా దేశాల అత్యున్నత పురస్కారాలు అందుకున్న ప్రపంచ నేత ప్రధాని మోదీ ఘనత సాధించారు. పాలస్తీనా అత్యున్నత పౌర పురస్కారం ‘గ్రాండ్‌ కాలర్‌ ఆప్‌ ది స్టేట్‌ ఆఫ్‌ పాలస్తీనా’ అవార్డును 2018లో ప్రధాని మోదీకి ఆ దేశం ప్రదానం చేసింది.

Also Read: ఏఐ సదస్సులో ప్రధాని చేతికి బాగ్ వాచ్.. ధర తెలిస్తే షాక్!

స్నేహితుడి కంటే ఎక్కువ

Advertisement

ప్రధాని మోదీ పర్యటన ఎంతో సంతోషమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అన్నారు. ప్రధాని మోదీ గొప్ప నాయకుడు అన్నారు. మోదీ తనకు స్నేహితుడి కంటే ఎక్కువ అన్నారు. మోదీ నేతృత్వంలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోదీ గొప్ప నాయకుడు అన్నారు. భారత్‌తో తమ వాణిజ్య ఒప్పందాలు పెరిగాయన్నారు. అనేక విషయాల్లో ఇజ్రాయెల్‌కు భారత్‌ అండగా నిలబడిందని నెతన్యాహు గుర్తుచేశారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×