// // Iran Attack: యూఏఐపై ఇరాన్ దాడి.. ముగ్గురు భారతీయులు తీవ్రగాయాలు, ప్రధాని మోదీ సీరియస్ -->
E-Paper
Advertisement

యూఏఐపై ఇరాన్ దాడి.. ముగ్గురు భారతీయులు తీవ్రగాయాలు, ప్రధాని మోదీ రియాక్ట్

యూఏఐపై ఇరాన్ దాడి.. ముగ్గురు భారతీయులు తీవ్రగాయాలు, ప్రధాని మోదీ రియాక్ట్
Advertisement

Iran Attack: ఇరాన్-అమెరికా యుద్ధం కాస్త తగ్గుముఖం పడుతున్న వేళ యూఏఈపై దాడి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలియగానే భారత్ రియాక్ట్ అయ్యింది. మౌలిక సదుపాయాలు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేసింది.

యూఏఐపై ఇరాన్ దాడి తీవ్ర కలకలం

Advertisement

యూఏఈలోని ఫుజైరాలోని ఓ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ మంగళవారం డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలియగానే కేంద్ర విదేశాంగ శాఖ రియాక్ట్ అయ్యింది. దాడులను ఖండించిన భారత్, ఇలాంటివి ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని తేల్చింది.

ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్టు చేశారు. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరించేలా చర్చలు, దౌత్యం కోసం భారత్‌ తన మద్దతును కొనసాగిస్తుందని చెప్పకనే చెప్పింది.

Advertisement

ముగ్గురు భారతీయులు తీవ్రగాయాలు, ప్రధాని మోదీ రియాక్ట్

అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హర్మూజ్‌ జలసంధి ద్వారా నౌకా వాణిజ్యం జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి చేసే అన్ని విషయాల్లో భారత్ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. యూఏఈపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.

ప్రపంచ ఇంధన భద్రత కోసం హర్మూజ్‌ గుండా నౌకా వాణిజ్యం జరగడం అత్యంత కీలకమన్నారు. ఈ ఘటనపై ఇరాన్ అధికారిక మీడియా రియాక్ట్ అయ్యింది. ఫుజైరాలోని చమురు శుద్ధి కేంద్రంపై కావాలని దాడి చేయలేదని తెలిపింది. హర్మూజ్‌లో నౌకలను బయటకు తీసుకురావడానికి అమెరికా చేస్తున్న దుస్సాహసమే ఈ ఘటనకు కారణమని తెలిపింది.

ALSO READ: బ్రెజిల్‌లో విషాదం.. సావో పాలోలో కుప్పకూలిన విమానం.. స్పాట్ లో 68 మంది మృతి

ప్రపంచంలో అన్నిదేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే హర్మూజ్‌ జలసంధిలో అమెరికా తన సైనిక సాహసకృత్యాలను ఆపాలని కోరింది. యూఏఈపై దాడి నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించాలని ప్రపంచ దేశాలు పిలుపు నిచ్చాయి. చర్చలు ఆపి సమస్యను పరిష్కరించుకోవాలని యూకే, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా దేశాలు ఇరాన్‌ను కోరాయి.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×