E-Paper
Advertisement

Plane Crash: స్కూల్ భవనంపై కూలిన విమానం.. పలువురు మృతి

Plane Crash: స్కూల్ భవనంపై కూలిన విమానం.. పలువురు మృతి
Advertisement

Plane Crash: బంగ్లాదేశ్ రాజధాని నగరం ఢాకాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం పాఠశాల బిల్డింగ్ పై కూలడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 19 మంది స్పాట్ లోనే  మృతిచెందారు. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చుట్టు పక్కల స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.

ఢాకాలోని ఉత్తరా ప్రాంతంలోని బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎఫ్-7 బీజీఐ విమానం మైల్‌స్టోన్ స్కూల్ పై కూలింది. ఈ ఘటనలో 19  మందికి అక్కడికక్కడే మృతిచెందారు. 164 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మధ్యాహ్నం 1:06 గంటల సమయంలో టేకాఫ్ అయిన ఈ చైనా తయారీ విమానం, కొద్ది నిమిషాల్లోనే స్కూల్ భవనంపై కూలింది. ఈ సమయంలో విద్యార్థులు తరగతుల్లోనే ఉన్నారు. ఫలితంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

Advertisement

విమానం కూలిన వెంటనే మంటలు భారీగా చెలరేగాయి.  స్కూల్ భవనానికి భారీ రంధ్రం పడింది. అగ్నిమాపక సిబ్బంది, సైన్యం, స్థానికులు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీలో 48 మంది క్లిష్ట పరిస్థితిలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో పైలట్ కూడా మరణించినట్లు నిర్ధారణ అయింది.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి దర్యాప్తుకు హామీ ఇచ్చారు. అధికారుల వివరాల ప్రకారం.. గాయపడిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. ఈ ప్రమాదం ఢాకాలో ఇటీవలి కాలంలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం అని చెప్పవచ్చు.

Advertisement

ALSO READ: Air India Flight: రన్‌వే పై జారిపడ్డ విమానం.. ప్రయాణికులంతా ఒక్కసారిగా

ALSO READ: Sivakasi News: భారీ పేలుడు.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×