E-Paper
Advertisement

Plane Crash: రోడ్డుపై విమానం బీభత్సం.. అత్యవసరంగా ల్యాండింగ్..ఆపై కార్లు ధ్వంసం

Plane Crash: రోడ్డుపై విమానం బీభత్సం.. అత్యవసరంగా ల్యాండింగ్..ఆపై కార్లు ధ్వంసం
Advertisement

Plane Crash: విమాన ప్రమాదం అనగానే ప్రయాణికులు హడలిపోతున్నారు. ఏ విమానం ఎక్కడ, ఎప్పుడు అనుకోని కారణంగా వల్ల ప్రమాదం వస్తుందని బెంబేలెత్తుతున్నారు. ఈ ఘటనలు ఒక్క ప్రాంతానికి పరిమితం కాలేదు. తాజాగా సాంకేతిక లోపం వల్ల ఓ విమానం రోడ్డుపై ల్యాండింగ్ అయ్యింది. ఆ సమయంలో చేసిన బీభత్సం అంతా ఇంతా కాదు.

అమెరికాలో రోడ్డుపై విమానం ల్యాండింగ్

Advertisement

అక్కడి కాలమానం ప్రకారం.. అమెరికాలోని జార్జియాలో సోమవారం ఉదయం అత్యవసరంగా ఓ విమానం రోడ్డుపై ల్యాండింగ్ అయ్యింది. ఆ సమయంలో రోడ్డుపై రద్దీగా ఉంది. ఆ సమయంలో చిన్న విమానం పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విమానం రెక్క డ్యామేజ్ అయ్యింది. అలాగే పలు కార్లు ధ్వంసమయ్యాయి.

అట్లాంటా సిటీకి ఉత్తరాన గైనెస్‌విల్లే‌లో హాకర్ బీచ్‌క్రాఫ్ట్ BE-36 అనే సింగల్ ఇంజిన్ విమానం వెళ్తుండగా ఇంజిన్‌లో టెక్నికల్ సమస్య తలెత్తింది. పరిస్థితి గమనించిన పైలట్ విమానం అదుపు తప్పుతుందని భావించాడు. వెంటనే జార్జియాలోని రద్దీగా ఉండే రహదారిపై ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నించారు. ల్యాండింగ్ తర్వాత విమానం ముందుకెళ్లింది. ఆ సమయంలో అక్కడున్న పలు కార్లను బలంగా ఢీకొట్టింది.

Advertisement

విమానం ల్యాండింగ్ సమయంలో కార్లు ధ్వంసం

ఈ ఘటనతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. విమానం రెక్కలు కార్లను తాకడంతో వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, అత్యవసర సేవల సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంతో గోల్డెన్ కోరల్ ప్రాంతంలో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డుపై ల్యాండైన విమానాన్ని అక్కడి నుంచి తొలగించారు. దీంతో అక్కడ ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. జరిగిన ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్-FAA అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఇంజిన్ వైఫల్యానికి గల ఖచ్చితమైన కారణాలను విశ్లేషిస్తున్నారు.  కొద్దిరోజుల కిందట కూడా ఇలాంటి ఘటన ఒకటి అమెరికాలో జరిగింది. అప్పుడు కూడా ట్రైనింగ్ విమానం అత్యవసరంగా జాతీయ రహదారిపై ల్యాండింగ్ అయ్యింది. అప్పుడూ పలు కార్లు ధ్వంసమయ్యాయి.

ALSO READ: అమెరికా నగరం పాకిస్తాన్‌లా అనిపిస్తోంది.. ముస్లిం వలసదారులతో నాశనం

 

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×