// // Telegram Durov: నా వీర్యం వాడుకోండి.. ఖర్చులు నేనే భరిస్తా, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ -->
E-Paper
Advertisement

Telegram Durov: నా వీర్యం వాడుకోండి.. ఖర్చులు నేనే భరిస్తా, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్

Telegram Durov: నా వీర్యం వాడుకోండి.. ఖర్చులు నేనే భరిస్తా, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్
Advertisement

Telegram Durov: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ సంచలన ప్రకటన చేశారు. తన స్పెర్మ్‌తో గర్భం దాల్చాలనుకునే 37 ఏళ్ల వయస్సు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న మహిళ ఐవీఎఫ్ చికిత్సకు నిధులు సమకూరుస్తానని చెప్పారు. 2013లో టెలిగ్రామ్‌ను స్థాపించిన 41 ఏళ్ల దురోవ్.. తనకు ఆరుగురు పిల్లలున్నారని ప్రకటించారు. అలాగే స్పెర్మ్ డొనేషన్ ద్వారా 100 మందికి పైగా పిల్లలకు తండ్రి అయ్యానని పేర్కొన్నారు. తన స్పెర్మ్ తో పుట్టిన పిల్లలందరికీ.. తన సంపదలో సమాన వాటాను ఇస్తానని ప్రకటించారు.

ప్రపంచవ్యాప్తంగా పురుషుల సంతానోత్పత్తిలో తగ్గిపోతుందని అందుకే స్పెర్మ్ డొనేషన్‌ను ఒక సామాజిక బాధ్యతగా దురోవ్ చెబుతున్నారు. కాలుష్య కారకాలతో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందన్నారు. ఐవీఎఫ్ క్లినిక్‌లు అధిక నాణ్యమైన వీర్యం కొరతతో ఇబ్బంది పడుతున్నాయని, అందుక తాను సహాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

మాస్కోలోని ఓ క్లినిక్ లో స్పెర్మ్

Advertisement

మాస్కోలోని ఒక సంతానోత్పత్తి క్లినిక్‌లో దురోవ్ స్పెర్మ్ అందుబాటులో ఉంది. ఇక్కడ 37 ఏళ్లలోపు పెళ్లికాని యువతులకు దీనిని అందిస్తారు. దురోవ్ నేరుగా ఈ విషయం చెప్పనప్పటికీ.. అతని జన్యు ప్రొఫైల్‌ను ఐవీఎఫ్ కు అనుకూలమైనదిగా ప్రచారం చేసి, అర్హత కలిగిన మహిళలకు IVF ఖర్చులను అతడే భరిస్తాడని పేర్కొంది. గర్భం దాల్చడానికి కష్టపడుతున్న స్నేహితురాలికి సహాయం చేయడానికి.. 2010లో తన స్పెర్మ్ ఇచ్చానని దురోవ్ చెప్పారు. ఆరోగ్యకరమైన స్పెర్మ్ డోనార్ల సంఖ్య తక్కువగా ఉందని చెప్పడంతో స్పెర్మ్ దానం చేయడం మొదలుపెట్టానని దురోవ్ చెప్పారు. జులై 2024లో టెలిగ్రామ్‌లో ఒక పోస్ట్‌ పెట్టిన దురోవ్.. తన స్పెర్మ్ ఇప్పటికీ అందుబాటులో ఉందని చెప్పారు. తన స్పెర్మ్ తో 12 దేశాలలోని కుటుంబాలకు సహాయం చేశాయని చెప్పారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దురోవ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో తన DNAని ఓపెన్ సోర్స్ చేయాలని నిర్ణయించానన్నారు. తన జీవసంబంధమైన పిల్లలు ఒకరినొకరు గుర్తించేలా చేస్తానని చెప్పారు.

Advertisement

Also Read: Telegram Durov: నా వీర్యం వాడుకోండి.. ఖర్చులు నేనే భరిస్తా, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్

2024లో అరెస్ట్

17 బిలియన్ డాలర్ల ఆస్తులు కలిగిన దురోవ్.. పునరుత్పత్తి, జనాభా క్షీణతపై తరచూ మాట్లాడుతుంటారు. కొంతమంది సంపన్నులు డీఎన్ఏ ఆప్టిమైజేషన్‌ను ప్రోత్సహించినప్పటికీ.. దురోవ్ తన చర్యలను పునరుత్పత్తిలో భాగంగా చెబుతుంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ కంటే ఎక్కువ వినియోగదారులను కలిగి ఉన్న టెలిగ్రామ్ పై 2024లో తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. టెలిగ్రామ్ తీవ్రవాద కంటెంట్‌ను కలిగి ఉందన్న ఆరోపణలపై దురోవన్ ఫ్రాన్స్‌లో అరెస్టు చేశారు. 5.6 మిలియన్ డాలర్ల పూచీకత్తు బెయిల్‌పై విడుదల చేశారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×