E-Paper
Advertisement

ప్రపంచాన్ని కాపాడామంటూ పాక్ డబ్బా.. మీమ్స్‌తో కుమ్మేస్తున్న భారత, ఇరాన్ యూజర్లు

ప్రపంచాన్ని కాపాడామంటూ పాక్ డబ్బా.. మీమ్స్‌తో కుమ్మేస్తున్న భారత, ఇరాన్ యూజర్లు
Advertisement

ISI Toolkit Exposed Social Media: ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేప‌థ్యంలో సోషల్ మీడియా వేదికగా ఒక వింతైన యుద్ధం మొదలైంది. ఈ శాంతి ఒప్పందానికి తామే అసలైన కారకులమంటూ పాకిస్థాన్ యూజర్లు X లో చేస్తున్న పోస్ట్‌లు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో నవ్వులపాలు అవుతున్నాయి. ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం అంచు నుండి తామే కాపాడామంటూ వారు వేసుకుంటున్న డబ్బాను నెటిజన్లు దారుణంగా రోస్ట్ చేస్తున్నారు.

విచిత్రం ఏమిటంటే, పాకిస్థానీయులు చేస్తున్న ఈ పోస్ట్‌లన్నీ ఒకే రకమైన మూస పద్ధతిలోఉండటం విశేషం. “నేను ఇప్పుడే విదేశీ విమానాశ్రయంలో దిగాను.. నా పాకిస్థానీ పాస్‌పోర్టును ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్‌కు ఇవ్వగానే, ఆయన నన్ను చూసి చిరునవ్వుతో మీరు ప్రపంచ శాంతి ప్రదాతలు, మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది అని చెప్పారుష‌ అని వందలాది పోస్ట్‌లు వెలిశాయి. ఇది పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISI లేదా ISPR తయారు చేసిన టూల్‌కిట్ ఆపరేషన్ అని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. జర్మనీ, ఇటలీ, కెనడా ఇలా ఏ దేశంలో దిగినా పాకిస్థానీయులకు ఇలాంటి ఘన స్వాగతం లభించడంపై జోకులు పేలుతున్నాయి.

Advertisement

ఈ ప్రచారంలో భాగంగా కొందరు పాకిస్థానీయులు భారత్‌ను కూడా లాగే ప్రయత్నం చేశారు. “పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపి భారత్‌ను ఇంధన, ఆర్థిక సంక్షోభం నుండి కాపాడింది. భారతీయులు ఇప్పటికైనా మాకు థాంక్స్ చెప్పాలి.” అంటూ పోస్ట్‌లు పెట్టారు. అయితే, వీటికి కమ్యూనిటీ నోట్స్ ద్వారా నెటిజన్లు చెక్ పెడుతున్నారు. ఇదంతా కేవలం ఎంగేజ్‌మెంట్ ఫార్మింగ్ కోసం కాపీ-పేస్ట్ చేస్తున్న ప్రచారం మాత్రమే అని స్పష్టం చేస్తున్నారు.

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలో పాక్ ప్రపంచాన్ని కాపాడిందంటూ చేస్తున్న అతి ప్రచారం వికటించింది. “పాకిస్థానీ అని పిలవబడటం వల్ల కలిగిన ఆ గాయం నుండి మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ కొందరు భారతీయ, ఇరానియన్ యూజర్లు కౌంటర్లు ఇస్తున్నారు. తమ దౌత్య సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని పాక్ చేసిన ఈ ప్రయత్నం, చివరకు అంతర్జాతీయ మీమ్ మెటీరియల్‌గా మారిపోయింది.

Advertisement

మ‌రోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కుదరడంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అక్కడి మీడియా డిమాండ్ చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాస్యాస్పదంగా మారింది. పాక్ కేవలం ఒక కొరియ‌ర్ మాత్రమే పనిచేసిందని అందరికీ తెలిసిందే.

Read Also: రైల్వే మన అందరిదీ అంటే ఇలా అర్థమైందా? బ్లాంకెట్లు కాజేసీ.. అమాయకంగా..

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×