E-Paper
Advertisement

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. స్పాట్‌లో 40 మంది మృతి!

పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. స్పాట్‌లో 40 మంది మృతి!
Advertisement

Bus Accident: దారుణం.. పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వేగంగా వెళ్తున్న ఒక బస్సు నియంత్రణ కోల్పోయి పర్వత ప్రాంతం నుంచి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. బలూచిస్థాన్‌లోని షేరానీ జిల్లా ధనాసర్ ప్రాంతం మీదుగా ఖైబర్ పఖ్తుంఖ్వా వైపు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. క్వెట్టా నుంచి పెషావర్ నగరానికి బయలుదేరిన ఈ బస్సులో ప్రమాద సమయంలో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.

ప్రమాదానికి అసలు కారణం ఇదే..
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ బస్సు మొదట క్వెట్టా నుంచి 36 మంది ప్రయాణికులతోనే బయలుదేరింది. అయితే, మార్గమధ్యంలో మరో బస్సు పాడైపోవడంతో, ఆ వాహనంలోని ప్రయాణికులను కూడా ఇదే బస్సులోకి ఎక్కించుకున్నారు. దీనివల్ల బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. దీనికి తోడు డ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడంతో, ఘాట్ రోడ్డులోని మలుపుల వద్ద బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా భారీ వాహనం పర్వతం పైనుంచి ఒక్కసారిగా కింద ఉన్న లోయలోకి పడిపోయిందని షేరానీ డిప్యూటీ కమిషనర్ వలీ ఖాన్ కాకర్ వెల్లడించారు.

Advertisement

తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు..
ఈ ఘోర ప్రమాదంపై బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు, స్థానిక జిల్లా యంత్రాంగం వెంటనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని వెలికితీసి చికిత్స నిమిత్తం ఝోబ్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన అధికారులు, ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు.

Also Read: వైద్య చరిత్రలోనే మహా అద్భుతం.. ఒకేసారి 5 అవయవాల మార్పిడితో యువకుడికి పునర్జన్మ!

Advertisement

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×