E-Paper
Advertisement

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు
Advertisement

పాకిస్తాన్ నాశనం కావాల్సిన పరిస్థితే వస్తే.. సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. అయితే ఈ చెత్తవాగుడుకి ఆయన అమె ఆయన అమెరికాని వేదికగా చేసుకోవడం విశేషం. నోబెల్ శాంతి బహుమతి ఆశిస్తున్న డొనాల్డ్ ట్రంప్ అండ చూసుకుని రెచ్చిపోతున్నాడు ఆసిమ్ మునీర్. ట్రంప్ విందుకి పిలవగా ఇటీవలే ఓసారి అమెరికా యాత్ర చేసి వచ్చిన మునీర్, తాజాగా మరోసారి అగ్రరాజ్యాన్ని సందర్శించారు. అక్కడి సైనికాధికారులు, ప్రభుత్వాధినేతలతో మంతనాలు జరిపారు. అక్కడినుంచే ఘాటు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

భారత్ పై క్షిపణి దాడి చేస్తాం..
భారత దేశంపై అణుదాడి చేస్తామని కూడా హెచ్చరించారు పాక్ ఆర్మీ చీఫ్. ఘర్షణలపై తీవ్ర ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. సింధు నదిపై ఉన్న భారత ఆనకట్టను క్షిపణులతో ధ్వంసం చేస్తామన్నాడు. ఢిల్లీ నుంచి తమకు ముప్పు ఎదురైతే ఇస్లామాబాద్ సగం ప్రపంచాన్ని కూల్చేస్తుందని అన్నారు. పాక్ పతనం అయ్యే దశకు చేరుకుంటే, పాక్ తో పాటు సగం ప్రపంచాన్ని కూడా పతనానికి తీసుకెళ్తామని అన్నారు మునీర్.

Advertisement

పూరీ సినిమా డైలాగ్…
టిప్పర్ లారీ వెళ్లి స్కూటర్ ని గుద్దితే ఎట్టా ఉంటదో తెలుసా అంటూ బుజ్జిగాడు సినిమాలో ప్రభాస్ తో దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పించే ఓ డైలాగ్ ని రిపీట్ చేశారు ఆసిమ్ మునీర్. భారత్ మెర్సిడెజ్ బెంజ్ కార్ లాంటిదని, పాకిస్తాన్ కంకర రాళ్లతో నిండిన డంప్ ట్రక్ లాంటిదని అన్నారు. అలాంటి డంప్ ట్రక్, మెర్సిడెజ్ బెంజ్ కార్ ని ఢీకొంటే ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకదా అంటూ వెటకారం చేశారు.

మేకపోతు గాంభీర్యం..
ఇటీవలే ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కి భారత్ గట్టి గుణపాఠం చెప్పింది. భారత శతఘ్నుల ధాటికి పాక్ కి చావుతప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. బాబ్బాబు ఇక దాడులు ఆపండి అంటూ బతిమిలాడుకుంటేనే భారత్ ఆపరేషన్ సిందూర్ కి విరామాన్నిచ్చింది. అయితే పాక్, భారత్ కాళ్లు పట్టుకున్న విషయం ఎవరికీ తెలియదు. యుద్ధం ఆపిన ఘనత తనదేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు భారత్ పై సుంకాల యుద్ధానికి తెరతీసిన ట్రంప్, అటు పాక్ పై ఎక్కడలేని ప్రేమ కురిపించడం విశేషం. పాకిస్తాన్ తో చమురు వెలికితీత ఒప్పందాలు కుదుర్చుకోడానికి ట్రంప్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ దశలో అగ్రరాజ్యం అండ చూసుకుని పాక్ కూడా రెచ్చిపోతోంది. భారత్ పైనే అణుదాడికి తెగబడతానని ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ చెప్పడం సంచలనంగా మారింది. భారత్ నే కాదు, సగం ప్రపంచాన్నే నాశనం చేస్తానంటూ మునీర్ చేసిన వ్యాఖ్యలు.. ఇతర దేశాలకు కూడా ఆగ్రహాన్ని తెప్పించాయి. పాకిస్తాన్ ని, పాక్ ని సపోర్ట్ చేస్తున్న అమెరికాని ఆయా దేశాల ప్రతినిధులు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రపంచ వినాశనాన్ని కోరుకుంటున్న ఇలాంటి దుర్మార్గులకు గట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు నెటిజన్లు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×