E-Paper
Advertisement

Imran Khan Party Ban: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్.. పీటీఐ పార్టీపై నిషేధం

Imran Khan Party Ban: ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్.. పీటీఐ పార్టీపై నిషేధం
Advertisement

Imran Khan Party Ban: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పై నిషేధం విధించడానికి ఆ దేశ ప్రభుత్వం సిద్ధమైంది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ వెల్లడించారు. అంతే కాకుండా ప్రభుత్వ రహస్యాలను లీక్ చేయడంతో పాటు అల్లర్లకు ప్రేరేపించినందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, అందుకే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్ 1996లో పీటీఐ పార్టీని స్థాపించారు. 2018 సంవత్సరంలో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అవిశ్వాస పరీక్షలో ఓడిపోవడం వల్ల ఇమ్రాన్ ప్రభుత్వం ఏప్రిల్ 2002లో కూలిపోయింది. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రార్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. రిజర్వుడు సీట్ల కేసులో పీటీఐ పార్టీకి, అక్రమ వివాహం కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ సుప్రీం కోర్టులో ఇటీవల ఊరట దక్కిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Advertisement

పీటీఐ కేసు వేయబోతున్నాం. ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు చేపడుతుందని తరార్ అన్నారు. పీటీఐపై ఆంక్షలు విధించేందుకు తగిన ఆధారాలున్నాయని. అందుకే తాము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 70 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ 1996 పీటీఐ పార్టీ స్థాపించి 2018 నుంచి 2022 వరకు ప్రధాన మంత్రిగా సేవలందించారు. అయితే అవిశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో ఇమ్రాన్ ప్రభుత్వం కుప్పకూలింది. పలు కేసుల ఆరోపణలతో ఎన్నికల్లో ఖాన్ పోటీపై నిషేధం విధించారు.

ఇన్ని ప్రతికూలత మధ్య కూడా పీటీఐకి విధేయులైన అభ్యర్థులు ఇతర పార్టీల కంటే ఎక్కువ సీట్లను గెలుచుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో వారు అధికారానికి దూరంగా ఉండిపోయారు. ఇదిలా ఉంటే పీటీఐపై నిషేధంపై ప్రభుత్వం చర్యలకు దిగుతుందనడంపై ఆ పార్టీ ధ్వజమెత్తింది. ప్రభుత్వ ప్రయత్నాలు సహించేది లేదని ఆరోపించింది. గతంలో కంటే పీటీఐ బలపడిందని ప్రభుత్వ యత్నాన్ని సవాలు చేస్తుందని పీటీఐ ప్రతినిధి రావు అస్సామ్ వెల్లడించారు.

Advertisement

Also Read: ‘ఒంటరిగా ఉండేవాడు.. అందరూ అతడిని ఏడ్పించేవారు’.. ట్రంప్ షూటర్ స్నేహితులు

కాగా ప్రస్తుతం పలు కేసులకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. మహిళలు, మైనారిటీలకు రిజర్వ్ చేసిన సీట్లను కేటాయించినందుకు ఆ పార్టీకి అర్హత ఉందని ఆ దేశ సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు తీర్పుతో జాతీయ అసెంబ్లీలో 23 రిజర్వుడు స్థానాలను పీటీఐ దక్కించుకుంది. తద్వారా పార్టీ సీట్లు 86 నుంచి 109కి పెరిగాయి. పీటీఐ ప్రస్తుతం ఆ దేశంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×