E-Paper
Advertisement

North Korea: రహస్య ప్రదేశంలో ఉత్తర కొరియా భారీ ఆయుధ ప్రదర్శన.. ఎందుకో తెలుసా ?

North Korea: రహస్య ప్రదేశంలో ఉత్తర కొరియా భారీ ఆయుధ ప్రదర్శన.. ఎందుకో తెలుసా ?
Advertisement

North Korea: ఉత్తరకొరియా భారీ ఆయుధ ప్రదర్శనను నిర్వహించింది. ఓ రహస్య ప్రదేశంలో జరిగిన వేడుకల్లో మొత్తం 250 క్షిపణి లాంఛర్లను ప్రభుత్వం ప్రదర్శించింది. కిమ్ జోంగ్ ఉన్ కూడా ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. ఈ వేడుకలో దేశీయంగా తయారు చేసిన కొత్త న్యూక్లియర్ క్షిపణి లాంచర్లను ప్రదర్శించారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది.

వాటిని సాయుధ కీలకంగా మారనున్న కొత్త రకం వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి లాంఛర్లుగా KCNA తెలిపింది. ఈ ప్రదర్శన జరుగుతున్నప్పుడు కిమ్ ఉన్నత అధికారులతో కలిసి కనిపించారు. తక్కువ సంఖ్యలో ప్రజలు వేడుకకు వచ్చినట్లు తెలుస్తోంది. ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య చెత్త బెలూన్ల యుద్ధం కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం ఉత్తర కొరియా పంపిన చెత్త బెలూన్లు సౌత్ కొరియా అధ్యక్ష కార్యాలయ ప్రాంగణంలో పడ్డాయని ఈ దేశ మీడియా సంస్థ వెల్లడించింది.

Advertisement

అయితే ఉత్తర కొరియానే ముందుగా చెత్త బెలూన్లను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. అవి సరిహద్దు దాటిన తర్వాత సియోల్ కు ఉత్తరంగా ఎగిరిందని పేర్కొంది. దీంతో బెలూన్ల నుంచి పడే వస్తువుల పట్ట జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది. చెత్త దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని దక్షిణ కొరియా వెల్లడించింది. మే నెల నుంచి ఈ బెలూన్ల యుద్ధం రెండు దేశాల మధ్య కొనసాగుతోంది. ఉత్తర కొరియా బెలూన్లను పంపడం ఇది పదోసారి అని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది.

ఇప్పటి వరకు రెండు వేల కంటే ఎక్కువగానే బిలూన్లను ప్రయోగించినట్లు తెలిపింది. అయితే ఈ బెలూన్లలో ఎరువులు, సిగరెట్ పీకలు, చెత్త వస్తువులు, వ్యర్థాలు ఉన్నాయని తెలిపింది. దక్షిణ కొరియా పంపిన బిల్లులకు ప్రతీకారంగానే చెత్త బెలూన్లలను పంపడం మళ్లీ ప్రారంభించామని ఉత్తర కొరియా వెల్లడించింది. ఉత్తర కొరియాకు గతంలో దక్షిణ కొరియా గట్టిగానే జవాబు ఇచ్చింది సరిహద్దుల్లో పెద్ద పెద్ద లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేసి ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారాలను కూడా ప్రారంభించింది.

Advertisement

Also Read: ట్రంప్ ప్రతిపాదన.. నో చెప్పిన కమలా‌హారిస్

సైనిక స్థావరాలు ఉన్న ఉత్తర కొరియా బార్డర్ లో స్పీకర్ల ద్వారా కే పాప్ సాంగీతం, విదేశీ వార్తలతో పాటు వ్యతిరేక ప్రసారాలను కూడా సైన్యం హోరెత్తించింది. ఉత్తర కొరియాలో విదేశీ వార్తలు కే పాప్ సంగీతాన్ని వినడానికి ప్రజలు ఇష్టపడరు. అవి తమ పౌర సమాజంలో ప్రభుత్వ వ్యతిరేక భావాలను నాటుతుందని, అధికారాన్ని బలహీనపరుస్తోందని కిమ్ భావిస్తారు. ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని దక్షిణ కొరియా రక్షణ మంత్రి సైనిక బలగాలను ఆదేశించింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×