E-Paper
Advertisement

North korea : మరో సారి కిమ్ కవ్వింపు చర్యలు.. నార్త్ కొరియా మిస్సైల్ ప్రయోగం..!

North Korea : దక్షిణ కొరియాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. కిమ్‌ ప్రభుత్వం ఓ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. సరిహద్దుల్లో లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌ నిర్వహించడం దీనికి కారణమైంది.

North korea : మరో సారి కిమ్ కవ్వింపు చర్యలు.. నార్త్ కొరియా మిస్సైల్ ప్రయోగం..!
Advertisement

North Korea : దక్షిణ కొరియాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. కిమ్‌ ప్రభుత్వం ఓ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. సరిహద్దుల్లో లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌ నిర్వహించడం దీనికి కారణమైంది.

ఈ పరిణామాల నడుమే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రభుత్వం ఓ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. దాదాపు నెల రోజుల వ్యవధిలో ఇది మొదటి మిసైల్‌ ప్రయోగం. దక్షిణ కొరియా సైన్యం దీన్ని ధ్రువీకరించింది. జపాన్‌ రక్షణశాఖ సైతం ఈ విషయాన్ని వెల్లడించింది. చివరి సారి గతేడాది డిసెంబరు 18న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించింది.

Advertisement

కిమ్‌ జోన్ ఉన్ బలగాలు ఇటీవల పశ్చిమ తీరంలో పెద్దఎత్తున పేలుళ్లు జరుపుతూ సైనిక విన్యాసాలు నిర్వహించాయి. దీంతో కొరియా ద్వీపకల్పం వేడెక్కింది. దక్షిణ కొరియా సైతం దీటుగా సమాధానం చెప్పింది. వాషింగ్టన్‌, సియోల్‌లు కవ్వింపు చర్యలకు పాల్పడితే వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని నూతన సంవత్సరం సందర్భంగా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన సైన్యానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఏప్రిల్‌లో దక్షిణ కొరియా పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఉత్తర కొరియా మరిన్ని క్షిపణి ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉందని సైనిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×