E-Paper
Advertisement

Miss Universe 2023 : మిస్ యూనివర్స్ 2023 విజేతగా నికరాగ్వా భామ “షెన్నిస్”

Miss Universe 2023 : మిస్ యూనివర్స్ 2023 విజేతగా నికరాగ్వా భామ “షెన్నిస్”
Advertisement

Miss Universe 2023 : నికరాగ్వాకు చెందిన షెన్నిస్ పలాసియోస్ అనే యువతి మిస్ యూనివర్స్ 2023 కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఎల్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో జరిగిన 72వ విశ్వసుందరి పోటీలలో షెన్నిస్ విజేతగా నిలిచింది. మాజీ విశ్వసుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ఈ కిరీటాన్ని షెన్నిస్ కు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. విశ్వసుందరి విజేతగా నిలిచిన షెన్నిస్ కు.. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ పోటీల్లో 84 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడగా.. భారత్ నుంచి 23 ఏళ్ల శ్వేతా శార్దా పోటీలో పాల్గొంది. సెమీస్ వరకూ వెళ్లిన శ్వేతా శార్దా విశ్వసుందరి కిరీటాన్ని పొందేందుకు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది.

23 ఏళ్ల శ్వేతా శార్దా.. చండీగఢ్ లో జన్మించింది. గతేడాది ముంబైలో జరిగిన మిస్ దివా యూనివర్స్ పోటీల్లో పాల్గొని.. 15 మంది అందగత్తెలతో పోటీ పడి ఆ కిరీటాన్ని సొంతం చేసుకుంది. 2021 విజేత దివితా రాయ్ నుంచి మిస్ దివా యూనివర్స్ కిరీటాన్ని అందుకుంది. 16 ఏళ్ల వయసులో ముంబైకి వచ్చిన శ్వేతా.. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ గ్యాడ్యుయేషన్ డిగ్రీని పూర్తిచేసింది. వృత్తిరీత్యా మోడల్ అయినా.. మంచి డ్యాన్సర్ కూడా. కాగా.. మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో గ్రామీ అవార్డు విజేత జాన్ లెజెండ్ తన సంగీతంతో అందరినీ ఆకర్షించాడు. సుమారు 13 వేల మంది ఈ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించినట్లు తెలిపారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×