E-Paper
Advertisement

Corona: బాబోయ్ మళ్లీ కరోనా!.. కొత్త వేరియంట్‌తో WHO అలర్ట్..

Corona: బాబోయ్ మళ్లీ కరోనా!.. కొత్త వేరియంట్‌తో WHO అలర్ట్..
Advertisement
corona virus

Corona: కరోనా. ఈ పేరు వింటేనే ఒకప్పుడు చచ్చేంత పని అయ్యేది. జనం పిట్టల్లా రాలిపోయేవారు. కంటికి కనిపించని వైరస్‌తో.. శక్తికి మించిన యుద్దమే చేశారు. రెండేళ్లు వెంటాడి.. వేటాడి.. వైరస్ కనుమరుగైంది. వ్యాక్సిన్‌ ఎంతో ఊరటనిచ్చింది. ఇక, హమ్మయ్యా అనుకున్నారంతా. అడపాదడపా కరోనా కేసులంటూ కలకలం రేపినా.. జనాలు పట్టించుకోవడం మానేశారు. కొవిడ్‌ను లైట్ తీసుకున్నారంతా.

కొత్త వేరియంట్‌లు వస్తూనే ఉన్నాయి.. పోతునూ ఉన్నాయి. అక్కడక్కడా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రజలన భయపెట్టేంతలా మాత్రం లేదు పరిస్థితి. తాజాగా అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ కనిపించింది. దానికి BA.2.86 గా పేరు పెట్టారు. యూఎస్‌తో పాటు డెన్మార్క్‌, ఇజ్రాయెల్‌లోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి.

Advertisement

అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం-CDC వెంటనే అలర్ట్ అయింది. కొత్త వేరియంట్‌పై కంప్లీట్‌గా స్టడీ చేస్తోంది. అటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO కూడా స్పందించింది. ‘వేరియంట్‌ అండర్‌ మానిటరింగ్‌’గా తెలిపింది.

మనుషులపై కొత్త వేరియంట్‌ దాడి చేసే తీవ్రత, వ్యాప్తి చెందే తీరుపై త్వరలోనే పూర్తి సమాచారం వెల్లడిస్తామని ప్రకటించింది. ఏ వేరియంట్ అయినా కరోనా నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎలాంటి మార్పు లేదని సూచించింది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×