E-Paper
Advertisement

Kuriga Kidnap: 300 మంది కిడ్నాప్‌.. రెండు వారాల తర్వాత విడుదల!

Kuriga Kidnap: 300 మంది కిడ్నాప్‌.. రెండు వారాల తర్వాత విడుదల!
Advertisement

Kuriga Kidnap

300 People Kidnaped in Kuriga: ఆఫ్రికాలోని నైజీరియాలో రెండు వారాల క్రితం కిడ్నాప్‌కు గురైన 300 మంది పాఠశాల విద్యార్థులను బందీలు ఎట్టకేలకు విడుదల చేశారు. ఈ మేరుకు స్థానిక అధికారులు ఆదివారం విద్యార్థుల విముక్తి గురించి తెలిపారు.

Advertisement

కడునా లోని కురిగా పట్టణంలోని ఓ పాఠశాల నుంచి మార్చి 7న ముష్కరులు దాదపు 300 మంది విద్యార్థులను అపహరించుకుపోయారు. దీన్ని అడ్డుకున్న ఓ వ్యక్తిని కాల్చి చంపారు. అపహరించిన పాఠశాల విద్యార్థులను దగ్గర్లోని అడవులకు తీసుకెళ్లారు. బూటీగా 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నైజీరియా అధ్యక్షుడు టినుబు పిల్లలను ఒక్క పైసా చెల్లించకుండి విడుదల చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. చెప్పినట్టుగానే ఒక్కపైసా చెల్లించకుండా కిడ్నప్‌కు గురైన వారందరినీ విడిపించారు.

Advertisement

కుడునా గవర్నర్ టినుబు తీసుకున్న చొరవకు ధన్యవాదాలు తెలిపారు. భద్రతా ఏజెన్సీలు తీసుకున్న వ్యూహాలతోనే ఇది సాధ్యమైందని అన్నారు. నైజీరియా భద్రతా సలహాదారు దగ్గరుండి ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షించారని కొనియాడారు. వారి చొరవతోనే పిల్లలు బయటకు వచ్చారని వెల్లడించారు.

Also Read: నైజీరియాలో స్కూల్స్‌పై ముష్కరుల దాడి.. 280 మంది విద్యార్థుల కిడ్నాప్..

నైజీరియాలోని పాఠశాలల నుండి పిల్లలను కిడ్నాప్ చేసిన అతివాద సంస్థ బోకో హరామ్ పదేళ్ల క్రితం ఈశాన్య బోర్నో రాష్ట్రంలోని చిబోక్‌లోని పాఠశాల నుంచి 276 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. వారిలో కొంతమంది ఆడవారిని ఇప్పటికీ విడిపించలేదు.

కాగా నైజీరియా విద్యార్థులను కిడ్నాప్ చేసి డబ్బును డిమాండ్ చేయడం సర్వ సాధారణమైంది. ఎలాంటి క్రయధనం చెల్లించకుండా పిల్లల్ని విడిపించడంతో నైజీరియా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Tags

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×