E-Paper
Advertisement

Musk Trump Interview: మస్క్‌తో ఇంటర్వ్యూ.. జో బైడెన్‌పై మరోసారి విరుచుకుపడిన ట్రంప్

Musk Trump Interview: మస్క్‌తో ఇంటర్వ్యూ.. జో బైడెన్‌పై మరోసారి విరుచుకుపడిన ట్రంప్
Advertisement

Elon Musk to interview Trump: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిలయనీర్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఇంటర్వ్యూలో భాగంగా డొనాల్డ్ ట్రంప్‌ మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి జో బైడెన్ వైఖరే కారణమని ట్రంప్ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ఉదాసీనత దీనికి కారణమని విరుచుకుపడ్డారు.

అదేవిధంగా జో బైడెన్ కారణంగా హంతకులు, డ్రగ్ డీలర్లు యూఎస్ లోకి అడుగుపెడుతున్నారని ట్రంప్ ఆరోపించారు. అయితే మస్క్ ఇంటర్వ్యూ తీసుకుంటుండగా కాసేపు సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో చాలామందికి ఆడియో అందుబాటులోకి రాలేదు. కొంతమంది వినియోగదారులు అసహనానికి గురయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఉన్న తరుణంలో ట్రంప్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలోనే జో బైడెన్ పై ట్రంప్ ఆరోపణలు చేశారు.

Advertisement

ఇదిలా ఉండగా, ఇటీవల ట్రంప్..కమలాహారిస్ పై నోరుపారుసుకున్నారు. కమలాహారిస్ ఓ ఫ్రాడ్ అంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఎక్స్ లో పోస్టు చేసిన ర్యాలీకి సంబంధించిన ఫొటోల్లో కమలాహారిస్ ఏఐను ఉపయోగించి జనం ఎక్కువగా ఉన్నట్లు చూపించారని ట్రంప్ ఆరోపించారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×