E-Paper
Advertisement

Iran Supreme Mojtaba: ఇరాన్‌ కొత్త సుప్రీం ఖమేనీ కొడుకు మొజ్తబా? రేసులో ముగ్గురు వ్యక్తులు

Iran Supreme Mojtaba: ఇరాన్‌ కొత్త సుప్రీం ఖమేనీ కొడుకు మొజ్తబా? రేసులో ముగ్గురు వ్యక్తులు
Advertisement

Iran Supreme Mojtaba: ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన వారసుడు ఎవరు? దాదాపు నాలుగు దశాబ్దాపాటు ఇరాన్‌ని నడిపించిన ఖమేనీ, తన వారసుడ్ని ఎందుకు ఎంపిక చేయలేదు? ఖమేనీ మృతితో రెండో కొడుకు మొజ్తబాకు బాధ్యతలు అప్పగించినట్టేనా? లేకుంటే తాత్కాలికంగా అప్పగించారా? రేసులో ఆ ముగ్గురు నేతలున్నారా? వారంతా కరుడుగట్టిన నేతలా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇరాన్‌ కొత్త సుప్రీం ఖమేనీ కొడుకు మొజ్తబా?

Advertisement

విప్లవాత్మక వ్యవస్థాపకుడు అయతుల్లా రుహోల్లా ఖొమేనీ మరణం తర్వాత ఇరాన్‌కు నేతగా ఎదిగాడు ఖమేనీ. 1989లో ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకుడిగా పదవిని చేపట్టిన ఆయన, మూడున్నర దశాబ్దాలుగా ఇరాన్‌‌ని పాలించారు. తన పదవీకాలంలో ఖమేనీ పాలనలో మంచి చెడులూ రెండు ఉన్నాయి. ఉక్కు పిడికిలితో దేశాన్ని పాలించాడనే అపవాదు లేకపోలేదు. మార్పు కోసం ప్రజలు పిలుపు ఇచ్చినా ఆయన తిరస్కరించాడు.

అసమ్మతిని అత్యంత దారుణంగా అణిచివేశాడు. తన పాలనను సవాల్ చేసిన నిరసనకారులను చంపమని ఆదేశించాడట. ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఖమేని. మొహమ్మద్ ఖతామి వంటి మితవాద వ్యక్తులతో సహా ఆరుగురు అధ్యక్షులతో కలిసి పని చేశారు. ఇరాన్ అణు కార్యక్రమానికి ఖమేనీ బాధ్యత వహించాడు. అతని పాలనలో టెహ్రాన్ రహస్యంగా అణ్వాయుధ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసిందని పశ్చిమ దేశాలు బలంగా నమ్మాయి.

Advertisement

రేసులో కీలక నేతలు.. ఖమేనీ ఎంపిక చేసిన ముగ్గురు వ్యక్తులెవరు?

సుప్రీం నాయకుడు ఖమేనీ మరణం తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చాలా ఏళ్లుగా మొగ్గు చూపారు. కానీ ఆయన 2024 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.అప్పటి నుండి సుప్రీం ఖమేని రెండో కొడుకు మోజ్తాబా వారసుడిగా ప్రచారం సాగుతోంది.  తెర వెనుక ప్రభావం చూపగల వ్యక్తి అని, తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తాడని చాలామంది నమ్ముతున్నారు.

ఆ జాబితాలో మోజ్తాబా ఒక్కడే లేడు. జూన్‌లో ఇజ్రాయెల్‌తో జరిగిన 12 రోజుల యుద్ధంలో తన స్థానంలోకి వచ్చే ముగ్గురు అభ్యర్థులను ఖమేనీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే వారి పేర్లు బహిర్గతం కాలేదు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు అధ్యక్షుడు, న్యాయవ్యవస్థ అధిపతి, శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్ మతాధికారి సభ్యుడు నాయకుడి బాధ్యతలు స్వీకరిస్తారు.

ఇరాన్ కొత్త సుప్రీం పోటీలో అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు మోజ్తాబా ఖమేనీ ఉన్నాడు. 56 ఏళ్ల మోజ్తాబా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్-IRGC, పారా మిలిటరీ దళంతో బలమైన సంబంధాలను కలిగి ఉన్నాడని చెబుతుంటారు. తండ్రి వారసత్వాన్ని కొడుకుని అక్కడి ప్రజలు ఇష్టపడరని, తదుపరి సుప్రీంగా ఆయన్ని నియమించే అవకాశం లేదని చాలా మంది చెబుతున్నారు.

ALSO READ: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కొత్త చీఫ్ అహ్మద్ వాహిదీ .. వీడు సామాన్యుడు కాదు

మోజ్తాబా ఉన్నత స్థాయి మతాధికారి కాదని బలంగా చెబుతున్నారు. మరొకరు అలిరేజా అరాఫీ. ఆయన ఖమేనీకి అత్యంత నమ్మకస్థుడు, ఆపై మతాధికారి కూడా. ప్రస్తుతం ఆయన అసెంబ్లీ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్నారు.గార్డియన్ కౌన్సిల్‌పై అధికారాలను కలిగి ఉన్నారు. అంతేకాదు ఇరాన్ సెమినరీ వ్యవస్థకు అధిపతి కూడా.

మొహమ్మద్ మెహదీ మీర్బాఘేరి సుప్రీం రేసులో ఉన్నాడు. 60 ఏళ్ల మీర్బాఘేరి కరుడుగట్టిన మతాధికారి.పశ్చిమ దేశాలను తీవ్రంగా వ్యతిరేకించేవారిలో ఒకడు. ప్రస్తుతం ఆయన ఉత్తర సిటీ కోమ్‌లో ఇస్లామిక్ సైన్సెస్ అకాడమీకి అధిపతిగా కొనసాగుతున్నారు. వీరితోపాటు ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు అయతుల్లా రుహోల్లా ఖొమేని మనవడు హసన్ ఖొమేని ఆ పదవికి రేసులో ఉన్నాడు.

ఆయన ప్రస్తుతం ఖొమేని సంరక్షకుడిగా ఉన్నాడు. ఎలాంటి ప్రభుత్వ పదవిని లేదు. ఆ దేశ రాజకీయాలు, భద్రతా యంత్రాంగంలో తక్కువ ప్రభావాన్ని కలిగి ఉన్నాడు. హషేం హొస్సేనీ బుషెహ్రీ కూడా ఈ రేసులో ఉన్నాడు. నిపుణుల అసెంబ్లీలో ముఖ్య నేతలతో దగ్గరి సంబంధాలున్న సీనియర్ మతాధికారి. ఆయన తొలి డిప్యూటీ చైర్మన్‌గా పని చేశారు. ఖమేనీకి దగ్గరగా ఉండేవారని, దేశీయంగా తక్కువ ప్రొఫైల్ కలిగిన వ్యక్తి.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×