// // Mojtaba Khamenei: ఎట్టకేలకు బయటకు వచ్చిన ఇరాన్ సుప్రీం.. నేరుగా వార్ రూమ్‌లోకి -->
E-Paper
Advertisement

ఎట్టకేలకు బయటకు వచ్చిన ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ.. నేరుగా వార్ రూమ్‌లోకి ఎంట్రీ, ఏఐ అంటూ..

ఎట్టకేలకు బయటకు వచ్చిన ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ.. నేరుగా వార్ రూమ్‌లోకి ఎంట్రీ, ఏఐ అంటూ..
Advertisement

Mojtaba Khamenei: ఇరాన్ యుద్ధం చివరిదశకు చేరుకుందా? ఆ దేశ కొత్త సుప్రీం మొజ్తాబా ఖమేనీ ఎక్కడ? కొన్నాళ్లుగా ఇవే ప్రశ్నలు చాలా దేశాలను వెంటాడాయి. తాజాగా ఆయనకు సంబంధించి ఓ వీడియో బయటకు వచ్చింది. ఆయన నేరుగా వార్ రూమ్‌లోకి వెళ్లినట్టు అందులో కనిపించింది. దీంతో ప్రత్యర్థులకు చెమటలు పడుతున్నాయి. ఇంతకీ ఆ వీడియో నిజమా? లేక ఏఐ ఆధారంగా చేసిందా?

ఎట్టకేలకు బయటకు వచ్చిన ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ

Advertisement

ఇరాన్ తొలి రోజు యుద్ధం నుంచి కనిపించని ఆ దేశ కొత్త సుప్రీం మొజ్తాబా ఖమేనీ ఎట్టకేలకు బయటకు వచ్చారు. వివిధ సందర్భాల్లో గతంలో రెండుసార్లు ఆయనకు సంబంధించి ఆడియోను ఇరాన్ దేశ టీవీ రిలీజ్ చేసింది. ఈసారి ఏకంగా మొజ్తాబాకు చెందిన వీడియో బయటకు వచ్చింది.

బయటకు నుంచి నేరుగా ఆయన వార్ రూమ్‌లోకి వెళ్లారు. ఆయన్ని చూసిన సైనిక అధికారులు కుర్చీ నుంచి పైకి లేచి నిలబడ్డారు.  కమాండ్ సెంటర్‌లో ఇజ్రాయెల్ డిమోనా అణు స్థావరం మ్యాప్‌తో మొజ్తాబా ఖమేనీ తొలిసారిగా ప్రత్యక్షమయ్యారు. ఆ సమయంలో అధికారులకు సుప్రీం సూచనలు ఇచ్చినట్టు కనిపిస్తోంది.

Advertisement

వార్ రూమ్‌లోకి ఎంట్రీ.. ఏఐ అంటూ మరోవైపు ప్రశ్నలు

డిమోనా అణు కేంద్రంగా పిలువబడే షిమోన్ పెరెస్ నెగెవ్ అణు పరిశోధనా కేంద్రం ఇజ్రాయెల్ దక్షిణ ఎడారి ప్రాంతంలో ఉంది. అందువల్ల అమెరికా నుండి ఏదైనా దాడి జరిగితే డిమోనా కేంద్రాన్ని దెబ్బ తీస్తామని పరోక్షంగా హెచ్చరించినట్టు కొందరు చెబుతున్నారు.  ఆ సమయంలో అధికారులకు సుప్రీం సూచనలు ఇచ్చినట్టు కనిస్తోంది.

మార్చిలో డిమోనా అణు కర్మాగారం సమీపంలో ఇరాన్ క్షిపణి దాడి చేసింది. దీనిపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ-IAEA హెచ్చరిక జారీ చేసింది. అణు పరిశోధనా కేంద్రానికి నష్టం వాటిల్లినట్లు ఎలాంటి సూచన లేవు. అణు సౌకర్యాల విషయంలో పాటించాలని కోరింది. ఇంతవరకు బాగానే ఉంది. ఉన్నట్లుంది మొజ్తాబా ఖమేనీ వీడియో బయటకు రావడం వెనుక ఏదైనా ప్లాన్ ఉందా? అంటూ కొత్త చర్చ మొదలైంది.

ALSO READ: భారీ యుద్ధానికి సన్నాహాలు.. టెహ్రాన్‌కు ట్రంప్ వార్నింగ్, రియాక్టయిన ఇరాన్, ట్రంప్ గడువు పొడిగిస్తారా?

GBX_Press అనే ఎక్స్ హ్యాండిల్ ఇరాన్ నుంచి విడుదల చేసినట్టు ఉంది. దీనిపై ఇరాన్ అధికారిక లేదా ప్రభుత్వ మీడియా ఖాతా, IRGC ఛానెళ్లు, Khamenei ఎక్స్ ఖాతా ఇంకా ధృవీకరించలేదు. కనిపిస్తున్న ఈ వీడియో 100 శాతం ఏఐ ద్వారా రూపొందించబడిందని గ్రోక్ చెబుతోంది.  మొత్తానికి  మొజ్తబా ఖమేనీ వీడియోపై ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×