E-Paper
Advertisement

Mexico Earthquake: మెక్సికోను కుదిపేసిన భారీ భూకంపం.. అధ్యక్షురాలు ప్రసంగిస్తున్న సమయంలో.. వీడియోలు వైరల్

Mexico Earthquake: మెక్సికోను కుదిపేసిన భారీ భూకంపం.. అధ్యక్షురాలు ప్రసంగిస్తున్న సమయంలో.. వీడియోలు వైరల్
Advertisement

Mexico Earthquake: మెక్సికో నగరాన్ని భారీ భూకంపం కుదిపేసింది. శుక్రవారం మెక్సికోలో 6.5 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ విలేకరుల సమావేశంలో మాట్లాతుండగా.. భూకంపం రావడంతో అందరూ బయటకు పరుగులు పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అధ్యక్షురాలు మాట్లాడుతుండగా…

వేదికపై అధ్యక్షురాలు మాట్లాడుతుండగా.. ఒక్కసారి భవనంలో భూకంపం సంభవించినప్పుడు హెచ్చరించే సైరన్లు మోగాయి. దీంతో అధ్యక్షురాలు షీన్‌బామ్ పోడియం నుంచి కిందకు దిగారు. విలేకరులు, సిబ్బంది హాల్ నుంచి బయటకు పరుగులు తీయడం వీడియోలో రికార్డు అయింది. తన కాళ్ల కింద నేల కదులుతోందని చెబుతూ.. విలేకరులతో కలిసి అడుగువెళ్లారు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి బ్రీఫింగ్ కొనసాగించారు.

రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రత

Advertisement

మెక్సికో నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రతను 6.5గా గుర్తించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ భూకంప తీవ్రతను 6.2గా నిర్థారించింది. గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో సమీపంలో భూకంపం కేంద్రీకృతమైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. భూకంపం భూమి లోపల దాదాపు 35 కి.మీ లోతులో సంభవించింది. భూకంప కేంద్రం పర్వత ప్రాంతంలోని రాంచో వీజోకు ఉత్తర-వాయువ్య దిశలో దాదాపు 2.5 మైళ్ల దూరంలో.. అకాపుల్కోకు నార్త్-ఈస్ట్ లో 57 మైళ్ల దూరంలో ఉందని పేర్కొంది.

సహాయక చర్యలు ముమ్మరం

Advertisement

రాజధానిలోని పలు ప్రాంతాల్లో తీవ్రమై ప్రకంపనలు సంభవించాయని పరిశోధకులు తెలిపారు. ఇప్పటివరకు తీవ్రమైన నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు రాలేదని అధ్యక్షురాలు షీన్‌బామ్ తెలిపారు.

Also Read:  తైవా‌న్ ని కుదిపేసిన భూకంపం.. కుప్పకూలిన భారీ భవనాలు, 7.0 గా నమోదు

భూకంప ప్రభావాన్ని అంచనా వేయడానికి, అత్యవసర సేవలు అందించడానికి అప్రమత్తంగా ఉన్నామని అధికారులు తెలిపారు. భూకంపనానికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తం భవనం కంపించినట్లు కనిపిస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×