// // Mexico Drug Cartel Violence: మండుతోన్న మెక్సికో.. డ్రగ్స్ లీడర్ ఎన్‌కౌంటర్‌తో అల్లర్లు.. స్కూల్స్ బంద్, దేశమంతా లాక్‌డౌన్ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Mexico Drug Cartel Violence: మండుతోన్న మెక్సికో.. డ్రగ్స్ లీడర్ ఎన్‌కౌంటర్‌తో అల్లర్లు.. స్కూల్స్ బంద్, దేశమంతా లాక్‌డౌన్

Mexico Drug Cartel Violence: మండుతోన్న మెక్సికో.. డ్రగ్స్ లీడర్ ఎన్‌కౌంటర్‌తో అల్లర్లు.. స్కూల్స్ బంద్, దేశమంతా లాక్‌డౌన్
Advertisement

Mexico Drug Cartel Violence: డ్రగ్స్ మాఫియా కింగ్ ‘ఎల్ మెంచో’ మృతితో మెక్సికో అట్టుడుకుతోంది. దేశంలో అల్లర్లు చెలరేగడంతో.. ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. డ్రగ్స్ గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి. పెట్రోల్ బ్యాంకులకు నిప్పు పెడుతున్నారు. మెక్సికన్ రాష్ట్రాల్లో స్కూళ్లను బంద్ చేశారు. ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని అడ్వెజరీ జారీ చేశారు.

“ఎల్ మెంచో” అని పిలిచే నెమెసియో రూబెన్ ఒసేగురా సెర్వంటెస్.. మెక్సికో క్రిమినల్ నెట్‌వర్క్‌లకు డాన్. ఇతడు ఫెంటానిల్, మెథాంఫెటమైన్, కొకైన్‌ వంటి డ్రగ్స్ ను అమెరికాకు రవాణా చేయడంలో, డ్రగ్స్ మాఫియాను అడ్డుకుంటున్న ప్రభుత్వ అధికారులపై దాడులను చేయడంతో సిద్ధహస్తుడు. మెక్సికన్ సైన్యం అతడ్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా, జరిగిన కాల్పుల్లో మరణించాడు. కార్టెల్ డ్రగ్స్ గ్యాంగ్ దేశవ్యాప్తంగా హింసకు పాల్పడుతోంది. రోడ్లను దిగ్బంధించి, వాహనాలకు నిప్పంటించారు.

మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు

Advertisement

మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్.. పౌరులు ప్రశాంతంగా ఉండాలని కోరారు. ఆదివారం నాడు చెలరేగిన హింసతో సైన్యం ఎదుర్కొంటుంది. 20 రాష్ట్రాలలో 250కి పైగా రోడ్ బ్లాక్‌లను తొలగించినట్లు ప్రెసిడెంట్ ప్రకటించారు. కార్టెల్ డ్రగ్స్ గ్యాంగ్ నాయకుడిని పట్టుకోవడానికి జరిగిన ఆపరేషన్‌కు అమెరికా నిఘా సంస్థ మద్దతు అందించిందని ఆమె తెలిపారు. రెండు దేశాలలో మోస్ట్ వాంటెడ్ నేరస్థులలో ఒకరైన మెంచోను మట్టుబెట్టినందుకు మెక్సికో సైన్యాన్ని వైట్ హౌస్ ప్రశంసించింది.

14 మంది మృతి

ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కిన్ పిన్ మరణంతో కార్టెల్‌లపై మరింత చర్యలు తీసుకోవాలనే మెక్సికోను ట్రంప్ కోరారు. జాలిస్కో రాష్ట్ర రాజధాని, మెక్సికోలోని రెండో అతిపెద్ద నగరమైన గ్వాడాలజారా ఆదివారం పూర్తిగా స్తంభించింది. హింస చెలరేగడంతో భయపడిన నివాసితులు ఇళ్లలోనే ఉండిపోయారు. మెక్సికో అంతర్జాతీయ విమానాశ్రయం పరిమిత సిబ్బందితో మాత్రమే పనిచేస్తుంది. జాలిస్కో, మిచోకాన్, గ్వానాజువాటోలలో ఆదివారం జరిగిన ఘటనలలో ఏడుగురు నేషనల్ గార్డ్ సైనికులు సహా కనీసం 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: డ్రగ్స్ మాఫియాపై ‘ఈగల్’ పంజా.. తెలంగాణలో సింథటిక్ డ్రగ్స్ అంతమే లక్ష్యం!

రూ.136 కోట్ల రివార్డు

ఎల్‌ మెంచోను పట్టుకునేందుకు మెక్సికో సైన్యం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. అమెరికా ఇంటెలిజెన్స్‌ సాయంతో మెంచో ఆచూకీని గుర్తించి చుట్టుముట్టారు. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మెంచోను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. అతడిపై దాదాపు రూ.136 కోట్లు రివార్డు ఉంది.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×