E-Paper
Advertisement

Trump: ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను పునరుద్దరించిన మెటా

Trump: ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను  పునరుద్దరించిన మెటా
Advertisement

Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్లు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ప్రకటించింది. అసాధారణ పరిస్థితుల్లో ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను 2020లో నిలిపివేశామని తెలిపింది. ప్రస్తుతం తిరిగి ఆయన ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యంతో తిరిగి ఆయన ఖాతాలను పునరుద్ధరించినట్లు వెల్లడించింది.

2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలు కావడంతో.. ఆయన మద్ధతుదారులు క్యాపిటల్ హిల్‌పై దాడికి దిగారు. ఆ సమయంలో విధ్వంసం చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా ట్రంప్ చేసిన ప్రకటనల వల్లే వారు దాడికి దిగారని ఆ సమయంలో వార్తలు వచ్చాయి. ఈక్రమంలో సామాజిక మాధ్యమాలు అతని ఖాతాలను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

Advertisement

ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని తాము భావిస్తున్నట్లు మెటా పేర్కొంది. వారు చెప్పే విషయాల్లో వాస్తవాలు లేకపోయినా మాట్లాడే అవకాశం ఇవ్వాలని వెల్లడించింది. అయితే గతంలో జరిగిన తప్పులను మాత్రం పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పింది. ఇటీవల ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక ట్రంప్ ఖాతాను పునరుద్ధరించిన విషయం తెలిసిందే.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×