E-Paper
Advertisement

Fire Accident in USA: అమెరికాలో భారీ పేలుడు.. 3 బిల్డింగ్‌లు తుక్కుతుక్కు

Fire Accident in USA: అమెరికాలో భారీ పేలుడు.. 3 బిల్డింగ్‌లు తుక్కుతుక్కు
Advertisement

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మాణ పనుల కోసం భారీ యంత్రాలు ఉపయోగిస్తున్న సమయంలో.. భూగర్భంలో ఉన్న గ్యాస్ పైప్ లైన్‌కు ప్రమాదవశాత్తూ తగిలింది. దాంతో గ్యాస్ లీక్ అయి క్షణాల్లోనే భారీ బ్లాస్ట్ జరిగింది. పేలుడు సమయంలో భారీ మంటలు ఎగిసిపడటంతో పాటు భవన శకలాలు కొన్ని మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. ఈ దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి.

Advertisement

పేలుడు జరిగిన వెంటనే అక్కడ ఉన్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. రోడ్లపై వెళ్తున్న వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్‌ పూర్తిగా నిలిచిపోయింది. ఈ ఘటనలో కనీసం ఆరుగురికి తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఇంజిన్లతో ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు.

రెస్క్యూ బృందాలు శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అనే కోణంలో గాలింపు చర్యలు ప్రారంభించాయి. భవనాలు పూర్తిగా కూలిపోయిన నేపథ్యంలో భారీ యంత్రాలతో శకలాలను తొలగిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Advertisement

Also Read: అల్లూరి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం.. బాధితులకు పరిహారం ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, శాన్‌ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఈ భారీ పేలుడు ఘటన నగర ప్రజలను తీవ్ర భయానికి గురిచేసింది. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×