E-Paper
Advertisement

Vanuatu Earthquake: వనౌటులో భారీ భూకంపం, ఊహించని విధంగా ఆస్తినష్టం

Vanuatu Earthquake: వనౌటులో భారీ భూకంపం, ఊహించని విధంగా ఆస్తినష్టం
Advertisement

Vanuatu earthquake: దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి వనౌటు తీరం అతులాకుతలమైంది. దీని ప్రభావం రిక్కర్ స్కేలుపై 7.3గా నమోదు అయ్యింది. కొన్ని సెకన్లుపాటు భూమి కంపించడంతో ఆదేశ ప్రజలు భయంతో వణికిపోయారు. భూకంపం ధాటికి పలు చోట్ల భవనాలు నేలమట్టం అయ్యాయి.

వనౌటు దేశానికి అతి పెద్ద సిటీగా ఉండే పోర్టు విలాకు వెస్ట్‌ ప్రాంతంలో భూకంపం కేంద్రాన్ని కనుగొన్నారు. 57 కిలోమీటర్లు లోతులో దీన్ని గుర్తించారు. గతంలో ఇదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో ప్రకంపనలు సంభవించిన విషయం తెల్సిందే.

Advertisement

పోర్ట్ విలాలోని పలు దేశాల రాయబార కార్యాలయాలు దెబ్బతిన్నాయి. అమెరికా, ఫ్రాన్స్ సహా వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లు అందులో ఉంటున్నారు. ఎత్తైన భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రాయబార కార్యాలయాలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి.

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఒకరు మృతి చెందినట్టు తెలుస్తోంది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్టు వార్తా ఏజెన్సీలు చెబుతున్నాయి. అక్కడ జరిగిన నష్టంపై తొందరగా అంచనాకు రాలేదని ఆదేశ అధికారుల మాట. భూకంపం నేపథ్యంలో కమ్యూనికేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Advertisement

ALSO READ: బంగ్లాదేశ్‌లో ఎన్నికలు అప్పుడే.. తేల్చిచెప్పిన యూనుస్

కాకపోతే భూకంపం సమయంలో ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పనిఫిక్ మహాసముద్రంలో 80 చిన్న చిన్న దీవుల సమూహమే వనౌటు దేశం. ఇక్కడ 3.50 లక్షల మంది నివశిస్తున్నారు. అయితే రింగాఫ్ ఫైర్ జోన్ లో ఉండడంతో ఈ ప్రాతంలో తరచు భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి.

వనౌటులో సంభవించిన భూకంపంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లకు ఎలాంటి సునామీ ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నారు. వనౌటులో వంతెనలు బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. తీర ప్రాంత ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×