E-Paper
Advertisement

Johannesburg: జోహన్నెస్‌బర్గ్‌ సిటీలో కాల్పుల కలకలం.. స్పాట్‌లో 10 మంది మృతి, ఇంకా..

Johannesburg:  జోహన్నెస్‌బర్గ్‌ సిటీలో కాల్పుల కలకలం.. స్పాట్‌లో 10 మంది మృతి, ఇంకా..
Advertisement

Johannesburg:  దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ సిటీలోని బెకర్స్‌డాల్ టౌన్‌షిప్‌లో దారుణమైన ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల సంఘటనలో కనీసం 10 మంది మరణించారు. ఇంకా అనేకమంది గాయపడ్డారు. వెంటనే బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులకు తెగబడింది ఎవరు? దీని వెనుక ఎవరున్నారు? అనేదానిపై అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు.

జోహన్నెస్‌బర్గ్‌ సిటీలో కాల్పుల కలకలం

Advertisement

దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నగరానికి సమీపంలోని బెకర్స్‌డాల్ టౌన్‌షిప్‌లో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని జరిగిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. మరో 20 మంది వరకు గాయపడ్డారని స్థానిక మీడియా ఛానెల్స్ చెబుతున్నాయి. ఈనెలలో దక్షిణాఫ్రికాలో జరిగిన రెండో ఘటన ఇది.

జోహన్నెస్‌బర్గ్ నగరానికి సమీపంలోని బెకర్స్‌డాల్ టౌన్‌ షిప్ ఉంది. అక్కడి కాలమాన ప్రకారం.. అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ ఘటన జరిగింది. తెల్లటి సెడాన్‌ కారులో వచ్చిన దుండగులు వీధుల్లో ఉన్న వ్యక్తులపై కాల్పులు జరిపారు. దాదాపు పావుగంట లేదా అర్థగంటపాటు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

తుపాకులతో స్థానికులపై కాల్పులు, స్పాట్ లో 10 మంది మృతి

కాల్పులు జరిగిన అక్కడి నుండి పారిపోయినట్టు స్థానికులు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో పాల్గొన్నవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. దక్షిణాఫ్రికాలోని కొన్ని ప్రధాన బంగారు గనులకు సమీపంలో బెకర్స్‌డాల్ టౌన్‌షిప్ ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. టౌన్‌ షిప్ లో కాల్పులు జరగాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు వచ్చింది? దీని వెనుక ఎవరున్నారు? అనేదానిపై దర్యాప్తులో నిమగ్నమయ్యారు అక్కడి పోలీసు అధికారులు.

ALSO READ:  సంపదలో చరిత్ర సృష్టించిన టెస్లా సీఈఓ ఎలన్ మస్క్

డిసెంబర్ 6న, రాజధాని ప్రిటోరియా సమీపంలోని ఒక హాస్టల్‌లోకి ముష్కరులు చొరబడి, మూడేళ్ల చిన్నారితో సహా డజను మందిని చంపారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న ప్రదేశంలో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. 63 మిలియన్ల మందికి నివాసంగా ఉన్న దక్షిణాఫ్రికా, ప్రపంచంలోనే అత్యధిక హత్యలు నమోదవుతున్నాయి.

బంగారు గనులకు కేరాఫ్ అయిన సౌతాఫ్రికాలో సామూహిక కాల్పులు సర్వ సాధారణం. గతేడాది హత్యలు 20 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. 2024 పోలీసు నేర గణాంకాల ప్రకారం.. ఆ దేశంలో ప్రతి 20 నిమిషాలకు ఒకరు హత్యకు గురవుతున్నారు.  ఆ దేశంలో బంగారు మాఫియా ముఠాలు ఎక్కువగా ఉండడం దీనికి మరొక కారణంగా చెబుతున్నారు. ఒక నెలలో రెండు ఘటనలు జరగడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×