E-Paper
Advertisement

Amsterdam Airport A man killed: ఆమ్‌స్టర్‌డామ్ ఎయిర్‌పోర్టు, విమానం ఇంజిన్‌లో వ్యక్తి పడి..

Amsterdam Airport A man killed: ఆమ్‌స్టర్‌డామ్ ఎయిర్‌పోర్టు, విమానం ఇంజిన్‌లో వ్యక్తి పడి..
Advertisement

Amsterdam Airport A man killed: నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్ డామ్ ఎయిర్‌పోర్టులో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి విమానం ఇంజిన్‌లో పడి మృతి చెందాడు. డెన్మార్క్‌కు వెళ్లేందుకు కెఎల్ 1341 నెంబర్ గల విమానం పుష్‌బ్యాక్ అవుతోంది. అదే సమయంలో అక్కడే ఉన్న వ్యక్తిని ఇంజన్ లోపలికి లాక్కుంది.

వేగంగా తిరుతున్న బ్లేడ్లలో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో ఎయిర్‌పోర్టు అధికారులు షాకయ్యారు. చనిపోయిన వ్యక్తి ఎయిర్ పోర్టు సిబ్బందా? లేక ప్రయాణికుడా? అనేది తేలాల్సివుంది. దీనిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Advertisement

ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటన సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని దింపేసి మానసిక నిఫుణులతో వారికి కౌన్సెలింగ్ ఇప్పిస్తామని సంబంధిత ఎయిర్‌లైన్స్ చెబుతున్నమాట.

ALSO READ:  ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’.. ఎందుకింత వైరల్ అవుతోంది..

Advertisement

అక్కడి మీడియా మాత్రం మృతి చెందిన వ్యక్తి విమానయాన సంస్థ ఉద్యోగి అయి ఉంటాడని చెబుతున్నాయి. ఎందుకంటే ప్రమాదం సమయంలో ట్రావెలర్స్ అక్కడ ఉండరని గుర్తు చేస్తున్నాయి. ఎయిర్‌పోర్టుల్లో విమానం ఇంజన్ సమీపంలోని వారిని లోపలికి లాగే ఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. గతేడాది అమెరికాలోని టెక్సాస్‌ ఎయిర్‌పోర్టులో ఇదే విధంగా జరిగింది. మొత్తానికి నెదర్లాండ్స్ ఘటన విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×