E-Paper
Advertisement

Dubai Fire Accident: 67 అంతస్థుల బిల్డింగ్‌లో మంటలు.. 3820 మంది బందీ, చివరికి..

Dubai Fire Accident: 67 అంతస్థుల బిల్డింగ్‌లో మంటలు.. 3820 మంది బందీ, చివరికి..
Advertisement

67 అంతస్తుల భవనం
అందులో 764 అపార్ట్‌మెంట్లు
వాటిలో 3,820 మంది నివాసం
అలాంటి భవనంలో అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోండి. కానీ ఒక్కటంటే ఒక్క ప్రాణం కూడా పోలేదు. అగ్ని ప్రమాదం వల్ల ఆస్తినష్టం జరిగింది కానీ, ప్రాణ నష్టం లేదు. అంత సమర్థంగా పనిచేశాయి దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు. దాదాపు ఆరు గంటలపాటు అవిశ్రాంతంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ ఫైటర్స్. స్థానికులు వారిని అభినందించారు.

దుబాయ్ మెరీనాలోని 67 అంతస్తుల భవనంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు కానీ, శుక్రవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అక్కడి సివిల్ డిఫెన్స్ బృందాలకు సమాచారమిచ్చారు స్థానికులు వారు రంగంలోకి దిగారు. అగ్నిమాపక యంత్రాలతో అక్కడకు చేరుకున్నారు. మంటల్ని అదుపులోకి తేవడం కంటే ముందు అక్కడ ఉన్న బాధితుల్ని బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఆ పనిలో వారు సక్సెస్ అయ్యారు. మొత్తం 764 అపార్ట్‌మెంట్‌ల నుండి 3,820 మందిని సురక్షితంగా తరలించారు. ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా జరిగింది, ప్రత్యేక బృందాలు ప్రతి ఒక్కరినీ భవనం నుండి సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. వారంతా అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

మంటల్ని కూడా వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు ఝాము వరకు వారు శ్రమిస్తూనే ఉన్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతం ఇంకా పొగల మధ్య చిక్కుకుని ఉంది. లగ్జరీ అపార్ట్ మెంట్లలో ఉన్న ఫర్నిచర్ అంతా బూడిదైపోయింది. ఆ ప్రదేశంలో పొగల అలముకోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. బాధితులకు ప్రభుత్వం తాత్కాలిక నివాస ఏర్పాట్లు చేస్తోంది. వారి రోజువారీ కార్యకలాపాలకోసం ప్రభుత్వం సహాయం చేస్తుందని అంటున్నారు.

Advertisement

మెరీనా ప్రాంతంలోని భవనంలో అగ్నిప్రమాదం జరగడంతో.. దుబాయ్‌లో ట్రామ్ సేవలు నిలిచిపోయాయి. అయితే ప్రయాణికులకోసం బస్సు సర్వీసుల్ని ఏర్పాటు చేశారు. మెరీనా స్టేషన్ నుంచి పామ్ జుమైరా స్టేషన్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దుబాయ్ లో జరిగిన ప్రమాదం గురించి తెలియగానే.. మెరీనా ప్రాంతానికి సంబంధించిన చాలామంది తమ బంధువులకోసం ఆరా తీశారు. వారికి ఫోన్లు చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం పెద్దది అయినా ఏ ఒక్కరికీ ప్రాణాపాయం లేకపోవడం ఇక్కడ విశేషం. సకాలంలో స్పందించి తమ ప్రాణాలను కాపాడినందుకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×