E-Paper
Advertisement

Storm Warning Symbols : తుఫాను హెచ్చరికల చిహ్నాల అర్థం తెలుసా?

Storm Warning Symbols : తుఫాను హెచ్చరికల చిహ్నాల అర్థం తెలుసా?
Advertisement

Storm Warning Symbols : తుఫాను వేళ.. రేడియో, టీవీల్లో తరచూ ‘ఫలానా చోట తుఫాను హెచ్చరిక చిహ్నాన్ని ఎగరవేశారు’ అనే మాట వింటుంటాం. అసలు ఈ తుఫాను హెచ్చరిక అంటే ఏమిటి? ఈ చిహ్నాలకు అర్థమేమిటి? అనే వివరాల్లోకి వెళితే.. తుఫాను తీవ్రత ఎంత? అది ఎక్కడ తీరాన్ని, ఏ దిశలో దాటబోతోంది? వంటి పలు అంశాల ఆధారంగా వాతావరణ శాఖ మొత్తం 11 రకాల తుఫాను హెచ్చరికల చిహ్నాలను వాడుతుంది. ఈ హెచ్చరికలను బట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా నిలువరించడం, విపత్తు నివారణ బృందాలు సహాయ చర్యలు చేపడతారు.

> సముద్రంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావిస్తే.. వెంటనే 1వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.
> సముద్రంలో తుఫాను నిర్ధారణ అయిన వెంటనే ప్రజలను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించేందుకు 2వ నెంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.
> 3వ నెంబరు హెచ్చరిక అంటే.. ఉన్నట్లుండి పెద్ద గాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని హార్బర్‌లో హెచ్చరికలు జారీచేయడం. నౌకాశ్రయంలోని పడవలు, నౌకలను సురక్షిత ప్రాంతంలో నిలపాలని ఇది సూచిస్తుంది.
> 4వ నెంబరు చిహ్నం ఎగురవేస్తే నౌకాశ్రయం, తీర ప్రాంతాల్లోని జాలరులు, పడవలు సముద్రంలోకి వెళ్లరాదని అర్థం.
> ఇక.. 5వ నెంబరు చిహ్నం ఎగరవేశారంటే.. తుఫాను నౌకాశ్రయానికి కుడి వైపు తీరం దాటబోతోందని అర్ధం.

Advertisement

> అదే.. 6వ నంబరు చిహ్నం ఎగరవేస్తే.. తుఫాను నౌకాశ్రయానికి ఎడమవైపు తీరం దాటబోతోందని అర్థం.
> ఒకవేళ.. 7వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ అయితే.. నౌకాశ్రయం, దాని సమీప ప్రాంతాలపై తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపబోతోందని అర్థం.
> తీరంలో 8వ హెచ్చరిక చిహ్నం ఎగరవేశారంటే.. నౌకాశ్రయానికి కుడివైపు భీకరమైన తుఫాను తీరం దాటబోతోందని, > అదే.. 9వ నెంబరు ఎగురవేస్తే.. నౌకాశ్రయానికి ఎడమవైపు భయంకర తుఫాను తీరం దాటనుందని అర్థం.
>10వ నెంబరు చిహ్నం ఎగుర వేస్తే.. హార్బర్‌, చుట్టుపక్కల ప్రాంతాలు ప్రమాదంలో పడినట్టేనని హెచ్చరించటంతో సమానం.
> ఈ జాబితాలో చివరిదైన.. 11వ నెంబరు హెచ్చరిక జారీచేస్తే.. ఆ తుఫాను ఘోర విలయాన్ని సృష్టించబోతోందని అర్ధం.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×