E-Paper
Advertisement

KL Rahul: కేఎల్ రాహుల్-అతియాశెట్టి వివాహం.. వారికి మాత్రమే ఎంట్రీ!

KL Rahul: కేఎల్ రాహుల్-అతియాశెట్టి వివాహం.. వారికి మాత్రమే ఎంట్రీ!
Advertisement

KL Rahul: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి మరికొద్ది గంటల్లో ఒక్కటవ్వబోతున్నారు. నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట.. వివాహబంధంలోకి అడుగుపెట్టబోతోంది. ముంబైలోని ఖండాలా ఫామ్‌హౌస్‌లో సాయంత్రం 4 గంటలకు వివాహ వేడుక జరగనుంది. ఈ వేడుకకు ఇరుకుటుంబాల నుంచి కేవలం 100 మంది అతిథులు మాత్రమే హాజరవ్వబోతున్నారట. నటుడు, సల్మాన్ ఖాన్, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ వేడుకలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇరువురి ఇంట్లో ఈనెల 21 నుంచే పెళ్లి హడావుడి మొదలైంది. 22న ఉదయం మెహందీ ఫంక్షన్.. అదే రోజున సాయంత్రం సంగీత్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో కేఎల్ రాహుల్, అతియా శెట్టితో పాటు ఇరు కుటుంబ సభ్యులు పలు బాలీవుడ్ సాంగ్స్‌కు స్టెప్పులేసి అలరించారు.

Advertisement

అయితే పెళ్లికి వచ్చే అతిథులకు ఫోన్లు, కెమెరాలు వంటివి తీసుకురావొద్దని చెప్పినట్లు సమాచారం. పెళ్లి జరుగుతున్న సమయంలో ఎటువంటి వీడియోలు, ఫొటోలు తీయొద్దని సూచించినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా సెలబ్రెటీలు పెళ్లిళ్లలో నో ఫోన్ పాలసీని పాటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక మేలో ఐపీఎల్ ముగిశాక గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారట. ఈ వేడుకలో సినీ, క్రికెట్ ప్రముఖులు దాదాపు 300 మంది పాల్గొననున్నట్లు సమాచారం. ముంబైలో ఈ వేడుకను నిర్వహించనున్నారట. అలాగే బెంగళూరులో మరో వేడుకను కూడా నిర్వహించనున్నట్లు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×