// // Karachi gas balloons: కరాచీలో గ్యాస్ బెలూన్లు.. ఎల్పీజీ కొరతతో ప్రమాదకరంగా స్టోరేజీ - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

కరాచీలో గ్యాస్ బెలూన్లు.. ఎల్పీజీ కొరతతో ప్రమాదకరంగా స్టోరేజీ

కరాచీలో గ్యాస్ బెలూన్లు.. ఎల్పీజీ కొరతతో ప్రమాదకరంగా స్టోరేజీ
Advertisement

Karachi gas balloons: ఇరాన్ యుద్ధంతో ప్రపంచ దేశాలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ వంట గ్యాస్ కు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుంది. గ్యాస్ సరఫరా లేకపోవడంతో.. కరాచీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పైప్ లైన్ నుంచి వస్తున్న వంట గ్యాస్ ను ప్లాస్టిక్ బెలూన్లలో నిల్వ చేస్తున్నారని స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది. కరాచీలోని ఒరంగీ టౌన్ ప్రాంతంలోని మోమినాబాద్‌ లో గ్యాస్ ను బెలూన్ల నింపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో.. ఇలా బెలూన్లలో నింపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గ్యాస్ పైప్ లైన్ నుంచి అప్పుడప్పుడు వస్తున్న సరఫరాను ప్రత్యేకంగా రూపొందించిన ప్లాస్టిక్ బెలూన్‌లలో నింపి, ఆ తర్వాత వాటిని వంటకు ఉపయోగిస్తున్నారు.

కరాచీలో గ్యాస్ సంక్షోభం

స్థానిక మార్కెట్లలో సుమారు రూ. 1,000 నుంచి రూ. 1,500 వరకు లభించే ఈ బెలూన్‌లను గ్యాస్ నింపుకునేందుకు ఉపయోగిస్తున్నారు. కొద్దిసేపు గ్యాస్ సరఫరా అవుతున్న సమయంలో ఈ బెలూన్లలోకి గ్యాస్ ను నింపుతున్నారు. ఇలా నింపిన గ్యాస్ ను రోజు వారీ వంటకు ఉపయోగిస్తున్నారు. కరాచీలో గ్యాస్ సంక్షోభం తీవ్రతకు ఇవి తెలియజేస్తున్నాయి. స్థిరమైన సరఫరా లేకపోవడంతో.. అనేక కుటుంబాలు కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాయని స్థానిక మీడియా తెలిపింది. అందుకే స్థానికులు ఇటువంటి అసాధారణమైన, ప్రమాదకరమైన పద్ధతులను పాటిస్తున్నారని పేర్కొంది.

మొబైల్ బాంబులు

Advertisement

ప్లాస్టిక్ బెలూన్లలో గ్యాస్‌ను నిల్వ చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. వీటిని ‘మొబైల్ బాంబ్’ లుగా తెలిపారు. చిన్నపాటి రాపిడి, వేడి లేదా నిప్పురవ్వ భారీ పేలుడుకు దారితీస్తుందని తెలియజేశారు. నివాస ప్రాంతాలలో ఇలాంటి వాటితో భారీ ప్రమాదాలు జరగవచ్చని హెచ్చరించారు. ఇళ్లలో ఇలాంటి గ్యాస్ బెలూన్లు ఉండటం అగ్ని ప్రమాదాల భయాలను పెంచుతాయంటున్నారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

యూఎస్-ఇరాన్ యుద్ధంతో ప్రపంచ ఇంధన సరఫరా చైన్ ప్రభావితం అవుతున్నాయి. దీంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న సంఘర్షణ, ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గమైన హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో చమురు, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

Also Read: ఇరాన్ యుద్ధం టెన్షన్ మొదలు.. గ్యాస్ కష్టాలు మళ్లీ రెట్టింపు, కేంద్రం కీలక నిర్ణయాలు

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×