E-Paper
Advertisement

Kamala Harris declines: ట్రంప్ ప్రతిపాదన.. నో చెప్పిన కమలా‌హారిస్

Kamala Harris declines: ట్రంప్ ప్రతిపాదన.. నో చెప్పిన కమలా‌హారిస్
Advertisement

Kamala Harris declines: అమెరికాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల పై కొత్త సర్వే విడుదలైంది. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌ కంటే ఒక శాతం ముందంజలో డెమోక్రటిక్ అభ్యర్థి కమలాహారిస్‌ ఉన్నారని సీబీఎస్‌ న్యూస్‌-యూగవ్‌ సర్వే తేల్చింది. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరు నేతల మధ్య పోటీపోటీగా ఉన్నట్లు తెలిపింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున కమలాహారిస్ దూసుకుపోతున్నారు. ప్రచారంలో ఆమె బిజీబిజీగా ఉన్నారు. అయితే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ టీవీ డిబేట్‌ను ఆమె సున్నితంగా తిరస్కరిం చారు. వచ్చే నెల నాలుగు ఫాక్స్ న్యూస్ ఆధ్వర్యంలో డిబేట్‌కు ట్రంప్ ప్రతిపాదనను డెమోకట్రిక్ అభ్యర్థి కమలాహారిస్ నో చెప్పారు.

Advertisement

డెమోక్రటిక్ అభ్యర్థిగా బైడెన్ ఉన్నప్పుడు కుదిరిన ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ 10న ఏబీసీ ఛానెల్‌లో చర్చ జరుపుతామని కమలాహారిస్ చెప్పారు. దీనికి మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇంతకీ కమలాహారిస్ ప్రతిపాదనను ఆయన ఓకే అంటారా? ఆ సమయం కష్టమని చెబుతారో చూడాలి.

ALSO READ: పాకిస్థాన్‌లో వర్ష బీభత్సం, 14 మంది మృతి

Advertisement

ఒకప్పుడు ఎక్కడైనా, ఎప్పుడైనా డిబేట్‌కు సిద్ధమని చెప్పిన ట్రంప్, దీనికి కొత్త ప్రాంతాన్ని ఎంచుకోవడం విచిత్రంగా ఉందన్నారు కమలాహారిస్. గతంలో అధ్యక్షుడు బైడెన్-ట్రంప్ మధ్య జూన్‌లో తొలి డిబేట్ జరిగింది. ఆ తర్వాత సెప్టెంబరు 10న ఏబీసీ న్యూస్ ఆధ్వర్యంలో సెకండ్ డిబేట్‌లో పాల్గొనాలని ఇద్దరు అంగీకరించారు. అయితే అధ్యక్ష రేసు నుంచి బైడెన్ డ్రాప్ కావడంతో కమలాహారిస్ తెరపైకి వచ్చారు.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×