// // Israel Attacks On Iran: ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. క్షిపణులతో విధ్వంసం - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Israel Attacks On Iran: ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. క్షిపణులతో విధ్వంసం

Israel Attacks On Iran: ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. క్షిపణులతో విధ్వంసం
Advertisement

Israel Attacks On Iran: ఇరాన్ పై అగ్ర రాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు తెగబడ్డాయి. అమెరికా అండగా ఇజ్రాయెల్.. ఇరాన్ పై క్షిపణుల వర్షం కురిపిస్తుంది. ఇజ్రాయెల్ శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై దాడికి దిగింది. నగరంలో చాలా చోట్ల భారీగా పొగ వ్యాపించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయాల సమీపంలో ఈ దాడి జరిగింది. అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై ఉద్రిక్తతల వేళ ఆ దాడులు కలకలం రేపుతున్నాయి.

ఇరాన్ పై అమెరికా ఒత్తిడి

ఇరాన్ సుప్రీం లీడర్ 86 ఏళ్ల ఖమేనీ దాడుల సమయంలో తన కార్యాలయాల్లో ఉన్నారా? లేదా? అనేది స్పష్టంగా తెలియలేదు. అమెరికాతో ఉద్రిక్తతలు పెరిగినందున.. ఆయన గత కొన్ని రోజుల పాటు బహిరంగంగా కనిపించలేదు. అణు కార్యక్రమంపై తనతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్ పై అమెరికా ఒత్తిడి తీసుకొస్తుంది. ఇప్పటికే పశ్చిమాసియాలో అమెరికా భారీగా యుద్ధ విమానాలు, యుద్ధనౌకలను మోహరించింది. ఇంతలో, ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడికి దిగింది.

30 ప్రాంతాల్లో దాడులు

Advertisement

ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌ ఇల్లు, నిఘా ప్రధాన కార్యాలయం సహా మొత్తం 30 ప్రాంతాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ వైమానిక దాడులు చేసే అవకాశం ఉన్నందున ఇజ్రాయెల్ తమ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. టెల్‌అవీవ్‌తో సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించింది. స్కూళ్లు, ఆఫీసులను మూసివేయాలని ఆదేశించింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ తన గగనతలాన్ని మూసివేసింది. ఇరాన్‌, ఇరాక్‌లు కూడా గగనతలాన్ని మూసివేశాయి. ఇరాన్‌ మొబైల్‌ ఫోన్‌ సేవలు నిలిచివేసింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఆ దేశం ప్రకటించింది.

ఇరాన్ ప్రతిదాడులు

ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ దాడులు చేపట్టింది. దీంతో ఇజ్రాయెల్ లో అనేక ప్రాంతాలలో సైరన్‌లు మోగాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.”కొద్దిసేపటి క్రితం, ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు ప్రయోగించిన క్షిపణులను గుర్తించి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సైరన్‌లు మోగించాం” అని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని సెల్‌ఫోన్లకు సందేశాలు పంపింది.

Advertisement

ఇరాన్ ను నాశనం చేస్తాం

ఇరాన్ పై దాడులు, పశ్చిమాసియా ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ సభ్యులు, సాయుధ దళాలు తమ ఆయుధాలను విడిచిపెట్టాలని ట్రంప్ హెచ్చరించారు. లేదంటే ఈ రాత్రి విధ్వంసం సృష్టిస్తామన్నారు. ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ పొందడానికి ఎంతో సమయం లేదన్నారు. ఇరాన్ అణు కేంద్రాలు, క్షిపణులు అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అందుకే ఈ దాడులు చేస్తున్నామని ట్రంప్ చెప్పారు. ఉగ్రవాదానికి ఇరాన్ అతి పెద్ద మద్దతుదారుడని ట్రంప్ అన్నారు. ఇరాన్ దేశ నాయకులు తమ మాట వినకపోతే ఆ దేశాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు.

Also Read: యుద్ధం అలర్ట్.. క్షణంలో ఇరాన్ ఖతం.?

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×