E-Paper
Advertisement

Ayatollah Khamenei: అయతుల్లా ఖమేనితోపాటు 40 మంది మృతి.. సమావేశం జరుగుతుండగా,చివరి వీడియో?

Ayatollah Khamenei: అయతుల్లా ఖమేనితోపాటు 40 మంది మృతి.. సమావేశం జరుగుతుండగా,చివరి వీడియో?
Advertisement

Ayatollah Khamenei: అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులకు ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేని టీమ్ అంతా తుడిచి పెట్టుకుపోయిందా? ఒకేసారి ఖమేని టీమ్‌ని వైమానిక దాడులు ఎలా హతమార్చాయి? కచ్చితంగా సమాచారం అమెరికా-ఇజ్రాయెల్ నిఘా సభ్యులకు ఎలా అందింది? దీనిపై ఇరాన్ టీవీ ఏం చెబుతోంది? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనితోపాటు 40 మంది మృతి

Advertisement

ఇరాన్ కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం ఖమేని నివాస భవనంపై అమెరికా-ఇజ్రాయల్ వైమానిక దళాలు విరుచుకుపడ్డాయి. ఏ మాత్రం గురి తప్పలేదు. చీమ చిటుక్కుమంటూ ఖమేని అక్కడి నుంచి తప్పించుకునేవారు. ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఒక్కసారిగా వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయని ఇరాన్ టెలివిజన్ తెలిపింది.

శనివారం ఉదయం ఇరాన్ జాతీయ భద్రతా మండలి సమావేశం జరగాల్సి వుంది. అయితే ఆ సమావేశం కాస్త శనివారం మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఈ విషయాన్ని ఇజ్రాయల్ నిఘా వర్గాలు ముందుగానే పసిగట్టాయి. 40 మంది సభ్యులతో ఖమేని ఇరాన్ జాతీయ భద్రతా మండలి సమావేశం జరుగుతుండగా బాంబులతో విరుచుకుపడ్డాయి అమెరికా-ఇజ్రాయల్ వైమానిక దళాలు.

Advertisement

ఇరాన్ జాతీయ భద్రతా మండలి భేటీ జరుగుతుండగా మెరుపు దాడులు

దీంతో ఖమేని తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయిందని ఆ దేశ మీడియా తెలిపింది. దాడుల గురించి ఏ మాత్రం సమాచారం తెలిసినా ఆయన భూగర్భ రహస్య స్థావరాల్లోకి వెళ్లిపోయేవారని చెప్పుకొచ్చింది. ఖమేనీ నాయకత్వంలోని దాదాపు 40 మంది సభ్యులు మరణించారని ఇరాన్ టెలివిజన్ ధృవీకరించింది. చనిపోయిన వారంతా ఇరాన్‌‌లోని కీలక నేతలు. చివరకు మెరుపు దాడులతో ఖమేని బంకర్లు ధ్వంసం అయ్యాయి.

మెరుపు దాడుల తర్వాత ఈ విషయం తెలుసుకోవడానికి ఇజ్రాయెల్ నిఘా వర్గాలు దాదాపు 12 గంటల సమయం పట్టిందట. అదే సమయంలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌లోని ఒక కమాండర్ ఓ ఛానెల్‌తో మాట్లాడారు. ఇరాన్ నాయకుల హత్యలు యుద్ధ గమనాన్ని ప్రభావితం చేయవన్నాడు. రాజకీయ అర్హత కలిగిన వ్యక్తులతో తక్షణ భర్తీని చేస్తుందని చెప్పుకొచ్చాడు.

ALSO READ: ఖమేనీ మృతి వార్త చదువుతూ ఏడ్చేసిన టీవీ యాంకర్.. వీడియో వైరల్

శనివారం నుంచి కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో దాదాపు 40 మంది ఇరానియన్ అధికారులు మరణించారని CBS న్యూస్ తెలిపింది. అలీ ఖమేనీ మృతిపై ధృవీకరించిన తర్వాత ఇరాన్ అధికారులు రాజ్యాంగ వారసత్వ విధానాలను అమలు చేయడానికి వేగంగా చర్యలు తీసుకున్నారు. ఖమేనీ హత్య తర్వాత న్యాయ వ్యవస్థ అధిపతి అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఆదేశ రాజ్యాంగ నాయకత్వ మండలి సమావేశమైంది. ఇకపై కఠినమైన ప్రతీకారం, ప్రాంతీయ ఉద్రిక్తత కొనసాగుతుందని ఆయన ఆ భేటీలో హెచ్చరించారు.

మృతి చెందినవారిలో సుప్రీం ఖమేనితోపాటు ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ అబ్దుల్‌రహీం మౌసావి, రక్షణ మంత్రి బ్రిగేడియర్ జనరల్ అజీజ్ నసీర్జాదే ఉన్నారు. IRGCలో అడ్మిరల్ హోదా కలిగిన సీనియర్ సైనిక, రాజకీయ వ్యక్తి అలీ షంఖానీ ఒకరు. ఆయన దశాబ్దాలుగా రక్షణ మంత్రి, సుప్రీం జాతీయ భద్రతా మండలి కార్యదర్శితో సహా అనేక కీలక పదవులను నిర్వహించారు.

ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లో రివల్యూషనరీ గార్డ్ తొలి కమాండర్‌గా నియమితుడయ్యాడు. ఆ తర్వాత గార్డ్ గ్రౌండ్ ఫోర్సెస్‌కు కమాండర్‌గా పని చేశాడు. IRGC దళాలకు డిప్యూటీ కమాండర్-ఇన్-చీఫ్ అయ్యాడు. 2023 ఆయన సుప్రీం లీడర్‌కు రాజకీయ సలహాదారుగా పని చేస్తున్నాడు. 2025లో అమెరికాతో అణు చర్చలలో షంఖానీ పాత్ర పోషించాడు. మేజర్ జనరల్ మొహమ్మద్ పక్‌పూర్ జూన్ 2025లో IRGC కమాండర్-ఇన్-చీఫ్‌గా నియమితులయ్యారు.

రాజకీయ భౌగోళిక శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందాడు. గార్డ్ ర్యాంకుల నుంచి కమాండ్ బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగాడు. అంతకుముందు గ్రౌండ్ ఫోర్స్, సబెరిన్ స్పెషల్ యూనిట్‌కు నాయకత్వం వహించాడు. ఇక మేజర్ జనరల్ అబ్దుల్‌రహీం మౌసావి జూన్ 13న ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితులయ్యారు. ఆ దేశంలోని అత్యున్నత సైనిక నిర్మాణానికి ఆయన నాయకత్వం వహించారు.

బ్రిగేడియర్ జనరల్ అజీజ్ నాసిర్జాదే 19 సంవత్సరాల వయసులో ఇరాన్ వైమానిక దళంలో చేరాడు. సమయంలో F-14 ఫైటర్ జెట్‌లను నడిపాడు. సీనియర్ కమాండ్ పాత్రల ద్వారా ముందుకు సాగాడు. 2021లో సాయుధ దళాల డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమితుడయ్యాడు. సలాహ్ అసది సైనిక అత్యవసర కమాండ్‌లో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతి. ఇరానియన్ సాయుధ దళాల సుప్రీం స్టాఫ్‌లోని సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×