// // Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తాబా.. అదే నిజమైంది? ఇదిగో వివరాలు -->
E-Paper
Advertisement

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తాబా.. అదే నిజమైంది? ఇదిగో వివరాలు

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తాబా.. అదే నిజమైంది? ఇదిగో వివరాలు
Advertisement

Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం అయితుల్లా మొజ్తాబా ఖమేనీ విషయంలో అమెరికా-ఇజ్రాయెల్ చెప్పిందే నిజమైంది. ఆ దేశాలు చేసిన సంయుక్త దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆయన గురించి రకరకాల వార్తల నేపథ్యంలో గురువారం మొజ్తాబా ఆడియో సందేశాన్ని ఆదేశ మీడియా ఛానెళ్లు ప్రసారం చేశాయి. దీంతో ఆయన బతికే ఉన్నాడని నిర్థారణ అయ్యింది.

ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తాబా.. అదే నిజమైంది? 

Advertisement

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చేసిన సంయుక్త దాడిలో తొలిరోజు కీలక నేతలు తుడిచిపెట్టుకుపోయారు. ఇరాన్ సుప్రీం అయితుల్లా అలీ ఖమేనితోపాటు కోడలు, మనవడు, కీలక నేతలు మరణించారు. రెండు రోజుల తర్వాత సుప్రీం కొడుకు మోజ్తాబా చనిపోయినట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. దీన్ని ఇరాన్ పాలకులు ఏ మాత్రం ఖండించలేదు.

యుద్ధం జరుగుతున్నా ఆ దేశంలోని మిగతా నాయకులు నోరు విప్పుతున్నారుగానీ, ఖమేని ఫ్యామిలీ సభ్యులు ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. మోజ్తాబా గురించి రకరకాల వార్తల నేపథ్యంలో గురువారం ఇరాన్ ఛానెళ్లలో ఆయన ప్రత్యక్షమయ్యారు. నేరుగా ఆయన కనిపించలేదుగానీ, ఆడియో వాయిస్‌ని టెలికాస్ట్ చేశాయి. దీంతో కచ్చితంగా తొలిరోజు దాడుల్లో మోజ్తాబా గాయపడ్డాడని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

Advertisement

తొలిరోజు దాడుల్లో మొజ్తాబా కాలు, కంటికి గాయాలు

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ కాలు బాగా డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. 56 ఏళ్ల ఖమేనీ ఎడమ కన్ను, ముఖంపై బలంగా గాయాలు అయ్యాయని రాసుకొచ్చాయి. ఆ దేశ అత్యున్నత పదవికి మోజ్తాబా ఖమేనీ ఎంపికైన తర్వాత ఆయన బహిరంగంగా కనిపించలేదు. ఆయన నుండి ఎటువంటి సమాచారం బయటకు రాలేదు.

మోజ్తాబా గాయాలు బారిన పడిన మాట వాస్తవమేనని సైప్రస్‌లోని ఇరాన్ రాయబారి అలిరేజా సలారియన్ అన్నారు. అయతుల్లా అలీ ఖమేనీ ఫ్యామిలీ తొలిరోజు దాడుల్లో ఐదుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిందన్నారు. బుధవారం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కొడుకు యూసఫ్ మీడియాతో మాట్లాడారు.

ALSO READ: ఇరాన్-అమెరికా యుద్ధం ఆగినా.. రెండు నెలల వరకు షిప్‌లు రావడం కష్టమే? అదే కారణం

ఖమేనీ గాయపడ్డారని విన్నానని కొత్త సుప్రీం సురక్షితంగా ఉన్నారని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఇరానియన్ స్టూడెంట్స్ న్యూస్ ఏజెన్సీ-ISNAకి తెలిపారు. కొత్త సుప్రీం ఉన్నత స్థాయి మతాధికారి కాకపోయినా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఆర్థిక ఉన్నత వర్గాలకు సన్నిహితుడు.

తండ్రి మాదిరిగా కాకుండా కఠినంగా ఉంటాడని అంటున్నారు పరిశీలకులు. తండ్రి స్థానంలోకి వచ్చేవరకు ఇరాన్ వెలుపల పెద్దగా ఆయనకు గుర్తింపు లేదు. అయినప్పటికీ, ఖమేనీ గతంలో అమెరికా ఆంక్షలకు గురయ్యారు. 2019లో తన తండ్రిపై వ్యతిరేకతనను ఉక్కుపాదంతో అణచివేశారు.  అందుకోసం IRGC తో దగ్గరగా పని చేశారనే ఆరోపణలతో యూఎస్ ట్రెజరీ ఖమేనీపై ఆంక్షలు విధించిన విషయం తెల్సిందే.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×