E-Paper
Advertisement

గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ హెచ్చరిక, అలాగైతే భూస్థాపితం చేస్తాం

గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ హెచ్చరిక, అలాగైతే భూస్థాపితం చేస్తాం
Advertisement

Iran Warning: యుద్ధానికి అమెరికా-ఇజ్రాయెల్ పది రోజులు గడువు ఇచ్చినా ఇరాన్ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తోందా? అస్త్రాలను మొహరించడమే కాకుండా, పొరుగు దేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చిందా? తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ హెచ్చరిక

Advertisement

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ ముఖ్య నేతలు హతం కావడంతో యుద్ధం ముగిసిందని అమెరికా భావించింది. ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఫలితంగా ప్రత్యర్థులను తమ భూభాగంలోకి రాకుండా ఎత్తుగడలు వేసింది. ట్రంప్ ఇచ్చిన గడువు కేవలం వారం రోజులు మాత్రమే మిగిలివుంది. చర్చలు ఏమోగానీ ఇరాన్ దూకుడు ఏ మాత్రం తగ్గలేదు.

ఇరాన్‌.. గల్ఫ్‌ దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. గల్ఫ్‌ దేశాల్లో దాడులు ఆగి, అభివృద్ధి నెలకొనాలంటే తాము చెప్పినట్లు చేయాల్సిందేనని ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ తేల్చిచెప్పారు. అమెరికాకు గల్ఫ్ దేశాలు సహకరించొద్దని వార్నింగ్ ఇచ్చారు. గగన తలాలను ఉపయోగించుకుని దాడి చేస్తున్నారని, ఈ విషయంలో అమెరికా-ఇజ్రాయెల్‌లకు అనుమతి ఇవ్వొద్దని బహ్రెయిన్‌, కువైట్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, జోర్డాన్‌, ఇతర పశ్చిమాసియా దేశాలకు ఆయన సూచన చేశారు.

Advertisement

అమెరికాకు ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చినా.. స్థావరాలను భూస్థాపితం చేస్తాం

తాము ఏ దేశంపై దాడులు చేయబోమని తేల్చి చెప్పారు ఆయన. కానీ మా దేశ మౌలిక సదుపాయాలు, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ ఏ మాత్రం ఊరుకోబోమన్నారు. ప్రతీకారం తప్పదని చెప్పకనే చెప్పారు. శత్రు స్థావరాలు భూస్థాపితం అయ్యేవరకు దాడులు కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ లెక్కన దాడులు చెస్తామని చెప్పకనే చెప్పారు.

అంతేకాదు శత్రువులకు సహకరించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలబోమన్నారు. బుధవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి కూడా పొరుగు దేశాలను ఇదే విధంగా చెప్పారు. శనివారం తెల్లవారుజామున గల్ఫ్‌లోని వివిధ దేశాల విమానాశ్రయంపై డ్రోన్ దాడులు జరిగాయి. వాటివల్ల విమానాశ్రయం రాడార్ వ్యవస్థకు నష్టం వాటిల్లింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఇరాన్‌లోని ఓ వార్తా సంస్థ తెలిపింది.

ALSO READ: రష్యా యువతిని కాపాడిన ట్రంప్ కొడుకు.. ఒక్క ఫోన్ కాల్ తో పోలీసులు పరుగులు

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అమెరికా ఎప్పటికప్పుడు గమనిస్తోంది. ఇరాన్ పొరుగుదేశాలపై దాడులను చేయడాన్ని నిశితంగా గమనిస్తోంది. ఏం చెయ్యాలా అనేదానిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వంలోని పలువురుతో చర్చలు జరుపుతోంది. చర్చల పేరుతో కాలయాపన చేస్తే బెటరని, లేకుంటే మొదటికే ఇబ్బందులు తప్పవని కొందరు సలహా ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చర్చల పేరుతో అమెరికా సాగదీస్తున్నట్లు తెలుస్తోంది.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×