// // Iran Vs America: వెనక్కి తగ్గని ఇరాన్.. అమెరికాతో ఇక చర్చల్లేవ్, తాడోపేడో తేల్చేందుకు -->
E-Paper
Advertisement

Iran Vs America: అమెరికాతో ఇక చర్చల్లేవ్, వెనక్కి తగ్గం, తాడోపేడో తేల్చేందుకు సిద్ధమైన ఇరాన్

Iran Vs America: అమెరికాతో ఇక చర్చల్లేవ్,  వెనక్కి తగ్గం, తాడోపేడో తేల్చేందుకు సిద్ధమైన ఇరాన్
Advertisement

Iran Vs America: అమెరికాతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది ఇరాన్. జరుగుతున్న యుద్ధంలో ఏ మాత్రం వెనక్కి తగ్గబోమని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం చాన్నాళ్లు సాగవచ్చనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

అమెరికాతో ఇక చర్చల్లేవ్-ఇరాన్

Advertisement

ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్దాన్ని ఇప్పటికప్పుడు అంచనా వేస్తోంది ఇరాన్ అగ్రనాయకత్వం. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, న్యాయ వ్యవస్థ చీఫ్ ఘోలామ్‌హోస్సేన్ మొహ్సేని-ఎజీ, మతాధికారి అలిరేజా అరాఫీ భేటీ అయ్యారు. జరుగుతున్న పరిణామాలపై చర్చించారు.

తాత్కాలిక నాయకత్వ మండలి రెండో సమావేశాన్ని సోమవారం లేకుంటే మంగళవారం నిర్వహించనుంది. వీరి భేటీ తర్వాత ఇరాన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. అమెరికాలో ఇక చర్చలు జరపబోమని తేల్చి చెప్పింది ఇరాన్. ఇజ్రాయెల్ -అమెరికా దాడుల నుంచి ఇరాన్ తనను తాను రక్షించుకుంటుందని తెలిపింది.

Advertisement

కీలక నేతల భేటీ తర్వాత ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ వెల్లడి

మధ్య ప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణమని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ఇజ్రాయెల్ పీఎం బెంజిమన్ నెతన్యాహూ అధికార దాహానికి ట్రంప్ సహకరిస్తున్నారని ఆరోపించారు. అమెరికా సైనికుల ప్రాణాలను ట్రంప్ పణంగా పెడుతున్నారని పేర్కొన్నారు. ఇరాన్ సాయుధ దళాలు దురాక్రమణను ప్రారంభించలేదన్నారు.

ఇజ్రాయెల్ అధికార దాహానికి అమెరికన్ సైనికులను బలి ఇచ్చారని ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నప్పటికీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భ్రమల్లో ఉన్నారని ఆరోపించారు. ట్రంప్ తన ఊహలతో ఈ ప్రాంతాన్ని గందరగోళంలోకి నెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు అమెరికన్ దళాలకు ప్రాణనష్టం సంభవిస్తుందని భయపడుతున్నారని రాసుకొచ్చారు.

ALSO READ: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. 165కు చేరిన విద్యార్థినుల మృతుల సంఖ్య

దౌత్య చర్చలపై వస్తున్న నివేదికలను ఆయన తోసిపుచ్చారు. వాషింగ్టన్‌తో చర్చలకు ఇరాన్ తలుపులు మూసేసిందన్నారు. ఇరాన్ స్థాపనలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో ప్రభావవంతమైన వ్యక్తులలో అలీ లారిజానీ ఒకరు. అంతేకాదు దివంగత ఖమేనీకి దీర్ఘకాల సలహాదారుడిగా పని చేశారు కూడా.

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×