E-Paper
Advertisement

Iran strike on Qatar: ఇరాన్ దూకుడు.. ఖతార్‌ గ్యాస్, చమురు క్షేత్రాలపై దాడులు, భారీగా నష్టం?

Iran strike on Qatar: ఇరాన్ దూకుడు..  ఖతార్‌ గ్యాస్, చమురు క్షేత్రాలపై దాడులు, భారీగా నష్టం?
Advertisement

Iran strike on Qatar: ఇరాన్‌‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఆ దేశ కీలక నేతలు హతమవుతున్నాయి. దీంతో అగ్గి మీద గుగ్గిలం అవుతోంది ఇరాన్. ఈ క్రమంలో పొరుగుదేశాలపై దాడులు తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో ఖతార్‌లోని గ్యాస్‌, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకొని అర్ధరాత్రి దాడులు చేసింది. ఈ దాడిలో భారీగా నష్టం జరిగినట్టు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి.

ఖతార్‌ గ్యాస్, చమురు క్షేత్రాలపై దాడులు ఇరాన్ దాడులు

Advertisement

అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ నేతలు హతమవుతున్నారు. తమ నేతలు లారిజానీ, ఇస్మాయిల్‌ ఖతీబ్‌ మరణానికి ప్రతీకారంగా దాడులు తీవ్రతరం చేసింది ఇరాన్. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో కీలక గ్యాస్‌, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకొని అర్ధరాత్రి నుంచి దాడులకు దిగింది.

ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్‌ లాఫాన్‌ ఇండస్ట్రియల్‌ సిటీ. ఇది ప్రపంచంలో అతిపెద్ద LNG ఎగుమతికి కేంద్రం. భారత్‌తోపాటు వివిధ దేశాలకు అక్కడి నుంచి గ్యాస్ సరఫరా అవుతుంది. రస్‌ లాఫాన్‌ గ్యాస్‌ క్షేత్రం నుంచి అత్యధికంగా ఫర్టిలైజర్స్‌, సీఎన్‌జీ, పీఎన్‌జీ అవసరాల కోసం ఆధారపడుతుంది.

Advertisement

రస్‌ లాఫాన్‌ ఇండస్ట్రియల్‌ సిటీ.. గ్యాస్ క్షేత్రంపై మిసైళ్లు

భారత్‌ కొనుగోలు చేసే ఎల్‌పీజీ 47 శాతం ఈ క్షేత్రం నుంచి లభిస్తుంది.ఆ నగరంపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఖతార్‌ ఆర్థిక వ్యవస్థకు ఆ నగరం చాలా కీలకం. ఈ దాడి వల్ల భారీగా నష్టం వాటిల్లింది. వెంటనే అత్యవసర బృందాలను రంగంలోకి దిగాయి. మంటలను అదుపు చేసేందుకు యత్నాలు చేపట్టాయి.

తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఆ తరహా దాడులు ఉద్రిక్తతలు పెంచుతాయని ఖతార్ హెచ్చరికలు జారీ చేసింది.ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్‌ ఎనర్జీ స్పందించింది. ఇరాన్‌ క్షిపణి దాడుల్లో పెద్ద సంఖ్యలో గ్యాస్‌ కేంద్రాల్లో నిప్పులు చెలరేగి దెబ్బతిన్నట్లు తెలియజేసింది. మరో వైపు సౌదీ అరేబియా కూడా దాదాపు 8 బాలిస్టిక్‌ మిసైల్స్‌ను అడ్డుకొన్నట్లు తెలిపింది.

ALSO READ: ఇండియాకు వెళ్లిపోండి, అక్రమ వలసదారులకు ట్రంప్ వార్నింగ్! బోనస్‌గా 2600 డాలర్లు ఇస్తాం.. 

అవసరమైతే సైనిక చర్యను తీసుకొనే హక్కు తమకు ఉందని సౌదీ విదేశాంగ మంత్రి బిన్‌ ఫర్హాన్‌ హెచ్చరించారు. అంతేకాదు యూఏఈలోని కీలకమైన ఆయిల్‌ ఫీల్డ్‌పై ఇరాన్‌ దాడులు ఉధృతం చేసింది. హబ్‌షాన్‌ గ్యాస్‌ కాంప్లెక్స్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆ దేశం తెలిపింది. ప్రపంచంలో అతిపెద్ద ఆన్‌షోర్‌ గ్యాస్‌ ప్రాసెసింగ్‌ కేంద్రం ఇది. పరిస్థితి గమనించిన ఆదేశం అక్కడి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపి వేసింది.

 

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×