E-Paper
Advertisement

ఇస్లామాబాద్ చర్చల్లో ప్రతిష్టంభన.. ట్రంప్ మామకు ఇరాన్ ఊహించని షాక్.. రాయబేరాలు మొదలుపెట్టిన అమెరికా

ఇస్లామాబాద్ చర్చల్లో ప్రతిష్టంభన.. ట్రంప్ మామకు ఇరాన్ ఊహించని షాక్.. రాయబేరాలు మొదలుపెట్టిన అమెరికా
Advertisement

Iran Vs America: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా? ఇరాన్-అమెరికా మధ్య ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన రెండో విడత శాంతి చర్చ ప్రతిష్ఠంభన కొనసాగుతుందా? తాజాగా ఇరాన్‌ స్పీకర్‌ కీలక వ్యాఖ్యలు వెనుక ఏం జరిగింది? నెక్ట్స్ అమెరికా ఎటువైపు అడుగులు వేయనుంది? యుద్ధానికి సిద్ధమవుతుందా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

ఇస్లామాబాద్ చర్చల్లో ప్రతిష్టంభన..  ట్రంప్‌కు ఇరాన్ ఊహించని షాక్

Advertisement

మంగళవారం ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్‌ మధ్య రెండోవిడత చర్చలు జరగాల్సి వుంది.ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టీమ్ అక్కడికి చేరుకుంది. ఈ సమయంలో ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. తమపై బెదిరింపులకు దిగుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వారితో చర్చలకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు ఇరాన్ పార్లమెంటు స్పీకర్‌ మహమ్మద్‌ ఘాలిబఫ్‌.

కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన, తమ నౌకల రాకపోకలపై దిగ్బంధనం వంటి అంశాలను ఆయన చూపించారు. దీనివల్ల దౌత్య సంబంధాలను దెబ్బతీశారని ఆరోపించారు. టెహ్రాన్‌ లొంగిపోయేలా ఒత్తిడి చేసేందుకు ఈ చర్చలను ఓ సాకుగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

Advertisement

రాయబేరాలు మొదలుపెట్టిన ట్రంప్.. ఇంతకీ చర్చలు జరుగుతాయా?

బెదిరింపుల మధ్య జరిగే చర్చలను ఎప్పటికీ అంగీకరించేది లేదన్నారు. రెండు వారాలుగా యుద్ధం కోసం సరికొత్త వ్యూహాలకు ఇరాన్ ప్లాన్ చేస్తోందని హెచ్చరించారు. ఇరాన్‌ చర్చల్లో పాల్గొనడంపై రకరకాల వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అమెరికా దిగ్బంధనం ఎత్తి వేసేవరకు చర్చల్లో పాల్గొనేది లేదన్నది ఇరాన్‌ నుంచి వినిపిస్తున్న మాట.

మరోవైపు చర్చల కోసం ఇరాన్‌ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతుందని ఆ దేశానికి చెందిన మరో వర్గం చెప్పినట్టు కథనాలు వస్తున్నాయి. ఇక, చర్చలకు వాన్స్‌ హాజరుకానున్న నేపథ్యంలో.. ఘాలిబఫ్‌ కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఉన్నట్లు అవి వెల్లడించాయి.

జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ నేపథ్యంలో ఆయన నుంచి ఓ మాట బయటకు వచ్చినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరాన్‌ నాయకత్వంతో నేరుగా చర్చలు జరిపేందుకు తాను సిద్ధమేనని సూచనప్రాయంగా అన్నట్లు రాసుకొచ్చాయి.

ALSO READ: ట్రంప్ టారిఫ్ రీఫండ్.. అమెరికా చరిత్రలో అతి పెద్దది, ఏకంగా 15 లక్షల కోట్లు వెనక్కి

ఇరాన్ కలవాలనుకుంటే మా దగ్గర చాలా తెలివైన వ్యక్తులు ఉన్నారని, ఒకవేళ నేరుగా తనను కలవాలనుకున్నా ఎలాంటి అభ్యంతరం లేదని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు ట్రంప్. అంతకుముందు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అమెరికా ఒత్తిడికి వ్యతిరేకంగా టెహ్రాన్ దృఢమైన వైఖరిని పునరుద్ఘాటించారు.

ఇరు దేశాల మధ్య పాతుకుపోయిన అపనమ్మకం కారణంగా చర్చల అవకాశాలను దెబ్బతీస్తుందని రాసుకొచ్చారు. ఏ చర్చలకైనా ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలన్నారు. ఇటీవలికాలంలో వాషింగ్టన్ అందుకు పరస్పర విరుద్ధమైన సంకేతాలు పంపుతోందని ఆరోపించారు. ఇలాంటి సందేశాలు ఇరాన్‌ను లొంగదీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తున్నాయని తేల్చిచెప్పారు.

 

Related News

కార్చిచ్చులో దారుణమైన ఘటన.. గాల్లో హెలికాప్టర్లు ఢీ, ఇద్దరు పైలట్లు మృతి

అమెరికాకు వెళ్లేవారికి భారీ షాక్.. సోమవారం నుంచే వీసా బాండ్ స్కీమ్, ఇండియా సేఫ్

24 గంటల్లో ఏం జరిగింది.. ఇరాన్‌పై మళ్లీ ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు?

ఒకసారి పట్టుకుంటే వదలదు.. ఆక్టోపస్ పట్టులో ఈతగాడు, వీడియో వైరల్

అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, నిందితుడు కూడా హతం

స్పెయిన్‌లోకి భారీగా చొరబాటు.. 57 మంది మృతి, సరిహద్దుల్లో ఉద్రిక్తత!

బొగ్గు గని లోపల భారీ పేలుడు.. 32 మంది మృతి, పాకిస్తాన్‌లో ఘటన

కొత్త మలుపు తిరిగిన యుద్ధం.. అమెరికా భారీ దాడులు, దద్దరిల్లుతున్న ఇరాన్‌, మళ్లీ ఏం జరిగింది?

Big Stories

Advertisement
×